15-07-2025 12:00:00 AM
మండల బీజేపీ నాయకుల హెచ్చరిక
చిన్న చింతకుంట జూన్ 14 : మూడు రోజుల్లో ఊక చెట్టి వాగు లోకి నీరు వదలాలని లేని పక్షంలో లో సీసీ కుంట &దేవర కద్ర మండలాల బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో రైతులంతా ఏ కమై మండలాల వ్యాప్తంగా తాసిల్దార్ కార్యాలయాలు దిగ్బంధం చేస్తామని, ధర్నాలు, రాస్తారోకాలు చేపట్టి ఆందోళన ఉదృతం చేస్తామని బిజెపి జిల్లా నాయకులు కురువ రమేష్, నంబిరాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రం ఆల్మట్టి డ్యాం నుంచి ప్రియదర్శిని జూరాలకు వరదలు వచ్చి 50 రోజులు అవుతున్నా కూడా మండలం లోని పర్దీపూర్ రిజర్వాయర్ ను నింపి దాని ద్వారా ఊక చెట్టి వాగులోకి వదలాల్సి ఉండగా ఇప్పటివరకు వదలలేదని విమర్శించారు. ఊక చెట్టి వాగు పై ఆధారపడి మండల ప్రజలు సాగు నీరు, త్రాగు నీరు లేక రైతులు,ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతురన్నారు.
ప్రియదర్శిని జూరాల డ్యాం నిండిన కూడా పర్దిపూర్ రిజర్వాయర్, ఊక చెట్టు వాగు కు నీళ్లు వదలకపోవడం ఏంటని ప్రశ్నించారు? ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 72 గంటల్లోగా నీళ్లు వదలాలని డిమాండ్ చే శారు.
జూరాల డ్యాం నుంచి వచ్చిన వరద జలాలను సరైన సమయంలో వాడుకోలేనీ అసమర్థ అధికార యంత్రంపై చర్యలు తీసుకోవాలని మండల బీజేపీ పార్టీ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా కార్య వర్గ సభ్యులు నరసింహ యాదవ్,జలీల్, లంకా ల రవి,వికాస్ నరసింహ, బుక్క మైను,మధు పాల్గొన్నారు.