19-06-2025 11:46:56 PM
గాంధీనగర్ కార్పొరేటర్ ఏ. పావని వినయ్ కుమార్..
ముషీరాబాద్ (విజయక్రాంతి): మహిళలకు స్వయం ఉపాధి కలిగించే ఉచిత శిక్షణ కేంద్రాలకు తమ పూర్తి సహకారాన్ని అందిస్తామని కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్(Corporator A. Pavani Vinay Kumar) అన్నారు. ఈ మేరకు గురువారం గాంధీనగర్ డివిజన్ వివిగిరి నగర్ కమ్యూనిటీ హాల్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ ప్యారడైజ్(Lions Club of Secunderabad Paradise) ‘నివి చారిటబుల్ ట్రస్ట్‘ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మహిళల ఉచిత బ్యూటిషన్ శిక్షణ కేంద్రాన్ని కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్, బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ తో కలిసి సందర్శించి పరిశీలించారు.
శిక్షణ పూర్తి చేసుకున్న మొదటి బ్యాచ్ మహిళలతో శిక్షణనిచ్చే టీచర్ ప్రవీణతో కార్పొరేటర్ మాట్లాడారు, శిక్షణ తరగతులు ఎలా వున్నాయి, ఎంత వరకు ప్రావీణ్యం పొందారు. శిక్షణ సమయంలో లభించిన సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు త్వరలో స్వయం ఉపాధితో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, వారికి బ్యూటీషన్ గా మంచి ఉద్యోగ అవకాశం కల్పించేందుకు సహకరిస్తాం అని కార్పొరేటర్ అన్నారు. త్వరలో మరో బ్యాచ్ మొదలవుతుందని ఈ ఉచిత శిక్షణ తరగతులను సదవకాశంగా భావించి డివిజన్ లోని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.