అవసరమైన సాయం అందిస్తాం
సీఎం రేవంత్‌కు ప్రధాని మోదీ ఫోన్
తక్షణసాయం అందిస్తామన్న కేంద్రమంత్రి అమిత్ షా
బాధితులను ఆదుకుంటాం : సీఎం
అమిత్ షా దృష్టికి తీసుకుపోయా: బండి సంజయ్
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): తెలంగాణలో భారీ వర్షాల వల్ల ఏర్పడిన పరిస్థి తులపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఆదివారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డికి ఆయన ఫోన్ చేశారు. ఖమ్మం జిల్లాలో భారీ నష్టం వాటిల్లిందని రేవంత్ రెడ్డి ప్రధానికి తెలిపారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రాణ నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తక్షణ సహాయ చర్యలను, తీసుకున్న జాగ్రత్తలను ప్రధాని దృష్టికి తీసుకుపోయారు.
ఈ నేప థ్యంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సేవలు అందించేం దుకు హెలికాప్టర్లను పంపిస్తామ ని ప్రధాని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని సహా యక చర్యలను అందిస్తామని భరోసా ఇచ్చా రు. కాగా.. అప్పటికే కేంద్రం ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను తెలంగాణ పంపించింది. ఇలా ఉండగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టానికి అవస రమైన తక్షణ సాయం అందిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. ఆదివారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఫోను చేశా రు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో వర్షా లు, వరదల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో వరదల వల్ల వాటిల్లిన నష్ట్టాన్ని ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రమంత్రికి వివరించారు. ప్రాణనష్టం జరక్కుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అవసరమై న సహాయక చర్యలు అందిస్తామని అమిత్‌షా హామీ ఇచ్చారు. ఇదిలాఉండగా.. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర స్థాయి అధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లతో నేరుగా మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికార యం త్రాంగాన్ని ముఖ్యమంత్రి అప్రమత్తం చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని సీఎం ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.
అమిత్ షా దృష్టికి తీసుకుపోయా: బండి సంజయ్
రాష్ట్రంలో భారీ వర్షాలు, ఖమ్మం జిల్లా పరిస్థితిపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఖమ్మం జిల్లాలో 110 గ్రామాలు ముంపునకు గురవడంతోపాటు పట్టణంలోని ప్రకాశ్‌నగర్ గుట్టపై 9 మంది, పాలేరు నియోజకవర్గంలోని అజ్మీరాతండా గుట్టపైన 68 మంది, బిల్డింగులపైన 42 మంది చిక్కుకున్న విషయాన్ని అమిత్ షాకు వివరించినట్లు వెల్లడించారు.
తెలంగాణలో ప్రాణ నష్టం లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఎన్డీఆర్‌ఎఫ్‌ను అమిత్ షా ఆదేశించినట్లు తెలిపారు. చెన్ను, వైజాగ్, అసోం నుంచి 3 చొప్పున మొత్తం 9 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను తెలంగాణకు పంపి నట్లు వివరించారు. ఎన్డీఆర్‌ఎఫ్ ఉన్నతాధికారులతో మాట్లాడి.. రాష్ర్ట అధి కారులతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టాలని ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలకు సంజయ్ సూచిం చారు. కేంద్రం ఆదేశాలతో ఎన్డీఆర్‌ఎ ఫ్ బృందాలు రంగంలోకి దిగి కార్యచరణ చేపట్టినట్లు ఆయన వివరించారు.






