02-09-2025 12:30:43 AM
ట్రాన్స్‌కో ఏడీ నాగిరెడ్డి
సిర్గాపూర్, సెప్టెంబర్ 1: సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్ గ్రామంలోని విద్యుత్ సబ్ స్టేషన్ లో త్రీ ఫీజ్ కరెంట్ కొరకు రై తులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని విజయక్రాంతితో ప్రచురితమైన కథనానికి విద్యుత్ శాఖ ఏడీ నాగిరెడ్డి స్పందించారు. రైతులకు నా ణ్యమైన త్రీ ఫీజ్ విద్యుత్ ను రాత్రి 10 గంటల వరకు అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు పంట పొలాలకు సాగు నీరు అందుతుందని అన్నారు.
ఏడి హామీ ఇవ్వడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కడ్పల్ ఎం.యాదవ్ రెడ్డి, లైన్మెన్ ఖాజా మియా, రైతు లు బి.హన్మంత్ రెడ్డి, ఎం.మనోహర్ రెడ్డి, ఓ.నారాయణ్ రెడ్డి, ఎం.నారాయణ్ రెడ్డి, ఎం.నారాయణ, సిహెచ్.రాజా మల్లయ్య, పెంట రెడ్డి, హన్మంతు, రహీమ్ సాబ్, సంగ్రామ్ నాయక్, బి.సంగమేష్ తదితరులు పాల్గొన్నారు.