02-09-2025 12:32:58 AM
* ఎంపీవో శ్రీనివాస్
కొండాపూర్, సెప్టెంబర్ 1 : పంచాయతీ అధికారుల ఆదేశాలు బేఖాతరు చేస్తూ సీజ్ చేసిన దాబాను నడిపిస్తున్న యజమానులపై పంచాయతీ అధికారులు కొరడా ఝుళిపించారు. సోమవారం విజయక్రాంతి దినపత్రికలో అధికారుల ఆదేశాలు బేఖాతరు..సీజ్ చేసిన దాబాను తెరిచిన యజమానులు అనే శీర్షికన ప్రచురించిన కథనానికి మండల పంచాయతీ అధికారులు స్పందించారు.
ఎంపీవో శ్రీనివాస్ నేతృత్వంలో గ్రామ కార్యదర్శితో కలిసి ఎలాంటి అనుమతులు లేకుండా వ్యాపారం చేస్తున్న కొండాపూర్ మండల పరిధిలో గిర్మాపూర్ శివారుకు చెందిన జాతీయ రహదారి పక్కనే ఉన్న కింగ్స్ 3 దాబాను సోమవారం సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎంపీవో శ్రీనివాస్ మాట్లాడుతూ అనుమతులు లేకుండా వ్యాపారం చేస్తున్న కింగ్స్ 3 దాబా యజమాన్యంపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎవరైనా అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.