02-09-2025 09:50:13 AM
హైదరాబాద్: ఉత్తర తెలంగాణలో నేడు, రేపు అతి భారీ వర్షాలు(Heavy rains) కురుస్తాయని భారత వాతావరణ శాఖ(India Meteorological Department) హెచ్చరించింది. దీంతో తెలంగాణలోని జిల్లాలకూ భారీ వర్ష సూచన హెచ్చరిక చేశారు. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనంతో పలు జిల్లాల్లో జోరుగా వానలు పడనున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతోందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, ఆదిలాబాద్, జనగామ, ఆసిఫాబాద్, కామారెడ్డి, మంచిర్యాల, మెదక్, నల్గొండ, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, యాదాద్రి భువనగిరిజిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.