02-09-2025 12:30:09 AM
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
రాజన్న సిరిసిల్ల:సెప్టెంబర్ 1(విజయక్రాంతి)జిల్లాలో రైల్వే లైన్ నిర్మాణానికి మట్టి తరలింపు అవసరమైన అనుమతులు పకడ్బందీగా పొందాలని జిల్లా కలెక్టర్. అన్నారు.సోమవారం జిల్లా సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో రైల్వే లైన్ నిర్మాణ పనులకు అవసరమైన మట్టి అనుమతుల పై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ, రైల్వే లైన్ నిర్మాణం కోసం తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్ గ్రామం చంద్రవాగు చెరువు నుంచి లక్ష క్యూబిక్ మీటర్ల మట్టి కేటాయింపు చేయగా ఇప్పటి వరకు 90 వేల 672 క్యూబిక్ మీటర్ల మట్టి తరలింపు జరిగిందని అన్నారు. సిరిసిల్ల లో రైల్వే స్టేషన్ నిర్మాణం, రైల్వే లైన్ నిర్మాణం కోసం సమీపంలో గల పా యింట్ నుంచి అవసరమైన మట్టి తరలింపు కేటాయింపు చేయాలని, దీనికి తగిన విధంగా ఏ ర్పాట్లు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
మట్టి తరలింపు కు తగిన విధంగా సినరేజి చార్జిలు వసూలు చేయాలని అన్నారు. నిర్దేశిత కేటాయింపుల మేరకు మాత్రమే మట్టి తరలింపు జరగాలని, అదనంగా మట్టి తరలించడానికి వీలు లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.ఈ సమావేశంలో రైల్వే శాఖ ఇంజనీరింగ్ అధికారి మూర్తి కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రవీణ్ తదితరులు పాల్గోన్నారు.