calender_icon.png 8 January, 2026 | 11:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థినితో స్కూల్ ప్రిన్సిపాల్ అసభ్య ప్రవర్తన

07-01-2026 12:59:00 AM

కుత్బుల్లాపూర్, జనవరి 6(విజయక్రాంతి): ప్రైవేట్ స్కూల్ హెడ్ మాస్టర్ 10వ తరగతి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి చంద్రగిరి నగర్ లోని నిస్సి స్వాతి స్కూల్ హెడ్ మాస్టర్ విజయ్ కుమార్ 10వ తరగతి చదువుతున్న విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు.ఈ విషయం విద్యార్థిని తల్లితండ్రులకు తెలియజేసింది. కోపంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ప్రిన్సిపాల్ కు దేహశుద్ధి చేసి, స్కూల్ ఫర్నిచర్ ధ్వంసం చేశారు. పోలీసులకు సమా చారం ఇవ్వడంతో ప్రిన్సిపాల్ ని అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఎంఈఓ స్పందన

ఈ ఘటన పై ఎంఈఓ స్పందించారు. నిస్సి స్వాతి స్కూల్ కు పర్మిషన్ లేదని, గతంలో కూడా ఈ స్కూల్ ని సీజ్ చేశామని తెలిపారు.మండలంలో మొత్తం 302 స్కూల్స్ కు మాత్రమే అనుమతులు ఉన్నాయన్నారు. పర్మిషన్ లేని పాఠశాలలను సీజ్ చేసి, చర్యలు తీసుకుంటామని తెలిపారు.