10 April, 2026 | 1:54 AM

నేడు ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు

08-12-2024 01:23 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 7 (విజయక్రాంతి): ట్యాంక్‌బండ్‌పై ఆదివారం ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ అడి షనల్ కమిషనర్ తెలిపారు. రాష్ట్ర ప్ర భుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ట్యాంక్‌బండ్‌పై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ద్వారా నిర్వహించబోయే ఎయిర్‌షో సందర్భంగా మధ్యాహ్నం 2 నుంచి 9 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని శనివారం ఒక ప్రకటన లో పేర్కొన్నారు. పంజాగుట్ట, రాజ్‌భవన్ నుంచి ఖైరతాబాద్ ఫ్లుఓవర్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను సైఫాబాద్ పాత పోలీస్‌స్టేషన్ వైపు, లిబర్టీ నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వచ్చే ట్రాఫిక్ ఇక్బాల్ మినార్ వైపు, ఇక్బాల్‌మినార్ నుంచి అంబేడ్కర్ జంక్షన్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను తెలుగు తల్లి ఫ్లు ఓవర్‌మీదుగా కట్టమైసమ్మ వైపునకు మళ్లిస్తామన్నారు.

నిరంకారి జంక్షన్ నుంచి వచ్చే వాహనాలు రవీంద్రభారతి వైపు, సైఫాబాద్ పాత పోలీస్ స్టేషన్ నుంచి వచ్చే వాహనాలను రవీంద్రభారతి, హెచ్‌టీపీ వైపు, హెచ్‌టీపీ నుంచి ఇక్బాల్ మినార్‌కు వచ్చే వాహనాలు లక్డీకపూల్ వైపు, అప్పర్ ట్యాంక్ బండ్ నుంచి వచ్చే వాహనాలు డీబీఆర్ మిల్స్ వైపు, సీజీ వో టవర్స్ నుంచి సెయిలింగ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను డీబీఆర్ మిల్స్ వైపు మళ్లించనున్నారు.