12 April, 2026 | 1:53 AM

ఫీజు బకాయిలు చెల్లించకుంటే ఆందోళనలు చేపడతాం

12-04-2026 12:06 AM
  1. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రభుత్వానికి హెచ్చరిక

ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించిన బీసీ సంఘాల నేతలు

ముషీరాబాద్, ఏప్రిల్ 11(విజయక్రాంతి): రాష్ట్రంలో 14లక్షల మంది విద్యార్థుల ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు,  ఎంపీ ఆర్. కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు 8 వేల కోట్లను తక్షణమే చెల్లించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన ప్రభుత్వాన్ని  హెచ్చరించారు. 

సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకల సందర్భంగా శనివారం బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పగిళ్ల సతీష్ కుమార్, జాతీయ బీసీ సంక్షేమ సం ఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ముదిరాజ్, బీసీ కులాల ఐక్యవేదిక అధ్యక్షుడు జీ అనంతయ్య  ఆధ్వర్యం లో ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో వందలాది మంది విద్యార్థులతో మెరుపు ర్యాలీని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంపీ ఆర్ కృష్ణ య్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాలకు సొంత భవనాలను నిర్మించాలని డిమాండ్ చేశారు. 119 బీసీ గురుకులాలు, వంద బీసీ కాలేజీ హాస్టళ్లను తక్షణమే మంజూరు చేయాలన్నారు.  ప్రభు త్వం విద్యార్థుల స్కాలర్షిప్స్, పీజు బకాయిల స్కీమ్‌ను నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారని, ఓ వైపు పీజులు కట్టాలని విద్యార్థులపై కాలేజీ యాజమాన్యాలు తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారని, ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు.

ప్రభుత్వం వెంటనే స్పందిం చి విద్యార్థులకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు మంజూ రు చేయాలని, లేని పక్షంలో బీసీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ నిరసన ర్యాలీలో బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ ముదిరాజ్, బీసీ కులాల ఐక్యవేదిక అధ్యక్షుడు జి. అనంతయ్య, బీసీ విద్యార్థి సం ఘం కన్వీనర్ కడారి శివకుమార్, యాదవ్, ఫణికాంత్, నిఖిల్ పటేల్ తో పాటు వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు.