calender_icon.png 4 August, 2025 | 11:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వానికి అండగా ఉంటాం

04-08-2025 12:34:31 AM

ఢిల్లీలో చేయనున్న ధర్నాకు టీఎన్జీవో మద్దతు 

మహబూబ్ నగర్ టౌన్ ఆగస్టు 3 : ప్రభుత్వానికి అండగా నిలబడుతూ ప్రజలకు సేవ చేస్తున్నామని టీఎన్జీవో జిల్లా అధ్యక్షు లు రాజీవ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి చంద్రనాయక్ లు ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొ న్నారు. బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ క ల్పించాలని, రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన ఈ నెల 5,6,7 తేదీలలో దేశరాజధాని జం తర్ మంతర్ వద్ద ధర్నా లో జిల్లా టీఎన్జీవో ఎస్ నేతలు పాల్గొనడం జరుగుతుందని పే ర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వెనుక బడిన బిసి లకు మేమంతా మంది మాకు అంత వాటా అనే నినాదం ను నిజం చేయడం లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీ లో తీర్మానం చేసి అమలుకోసం కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర పతి ఆమోదం కోసం పంపడం హర్షణీయం, తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సం ఘం మహబూబ్ నగర్ జిల్లా శాఖ సంపూర్ణ మద్దతు , వెంటనే రాష్ట్రపతి ఆర్డినెన్స్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం దేశ రాజధాని ఢిల్లీ లో ని ధర్నా చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.