15-12-2025 01:57:05 AM
కోదాడ డిసెంబర్ 14 : కోదాడ మండలం మంగ ళ్ తండాలో జరిగిన సర్పంచ్ ఎన్ని కల్లో బాబ్జి నాయ క్ ఘన విజయం సాధించారు. ప్రత్యర్థులపై 214 ఓట్ల మెజార్టీతో గెలుపొం దారు. ఈ విజయంతో మంగళ్ తండా గ్రామంలో ఆనందోత్సాహాలు అంబరాన్ని అంటాయి. కార్యకర్తలు, అభిమా నులు బాణాసంచా కాల్పులు, మిఠాయిల పంపిణీతో పాటు గ్రామ వీధుల్లో భారీగా సంబరాలు నిర్వహించారు.
మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొ ని నినాదాలతో గ్రామాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.ఈ సందర్భంగా బాబ్జి నాయక్ మాట్లాడుతూ, గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. మంగళ్ తండా గ్రామ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పని చేస్తానని, హామీ ఇచ్చారు.