నిర్వాసితులను ఆదుకుంటాం
07-03-2026 01:52 AM
- కొత్త ప్రాజెక్టులు వచ్చినప్పుడు కొందరికి ఇబ్బందే
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 6 (విజయక్రాంతి): కాలానికి అనుగుణంగా రాష్ట్రం లో అమలు చేస్తున్న అభివృద్ధి ప్రణాళికల్లో నిర్వాసితులు ఎవరికీ నష్టం జరక్కుండా అందరినీ ఆదుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కొత్త ప్రాజెక్టులు వచ్చినప్పుడు కొందరికి ఇబ్బంది ఉండొచ్చని, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో ఎవరినీ అనాథలను చేయమన్నా రు.
భూమి, ఇండ్లు పోయినా మంచి నష్టపరిహారమిచ్చి ఆదుకుంటుందని స్పష్టంచేశారు. శుక్రవారం హైదరాబాద్ బుద్వేల్ లేఔట్‌తో కలిపే రేడియల్ రోడ్ ఇంటర్‌చేంజ్‌కు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం కొత్వాలగూడలో ఎకో పార్కును ప్రారంభించి మాట్లాడారు. అందరినీ మెప్పించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు.




