calender_icon.png 6 December, 2024 | 5:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేద పద్మశాలీలను ఆదుకుంటాం

21-10-2024 12:16:12 AM

వరంగల్, అక్టోబర్ 20( విజయక్రాంతి): రాష్ట్రంలో ఉన్న పేద పద్మశాలీలను ఆదుకుంటామని తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈగ వెంకటేశ్వర్లు అన్నారు. ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లాలో అవార్డులు పొందిన పద్మశాలీ కమ్యూనిటీ  ఉద్యోగులను, జర్నలిస్ట్‌లను ఆదివారం హన్మకొండలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సన్మానించారు.

ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు మాటాడుతూ పద్మశాలీలు రాజకీయాల్లో చేరి అధికారం పొందాలన్నారు. కార్యక్రమంలో  కోడం రవిప్రకాశ్, గుండు ప్రభాకర్,  గడ్డం కేశవమూరి, కుసుమ సత్యనారాయణ, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్  గుర్రపు వీరస్వామి,  విద్యుత్ శాఖ సీజీఎం మధుసూదన్, వివిధ శాఖలకు చెందిన పద్మశాలి ఉద్యోగులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.