calender_icon.png 1 October, 2025 | 4:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో గెలిచి తీరుతాం

01-10-2025 01:41:54 AM

కాంగ్రెస్ బీసీ నేతల ధీమా 

హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి) :  రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో కేసు గెలిచి తీరుతామని కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నాయకులు మంగళవారం సమావేశమయ్యారు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు,ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాల పై చర్చించారు.

తమిళనాడు  తరహాలో ఇక్కడ కూడా రిజర్వేషన్లు అమలు అవుతాయని ధీమా వ్యక్తం చేశారు.   సమావేశంలో  పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, ప్రభు త్వ సలహాదారు కేకే, పీసీసీ మాజీ అధ్యక్షుడు వీహెచ్, ఎంపీ అనిల్ కు మార్ యాదవ్,ప్రభుత్వ విప్‌లు  ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు ఈర్లపల్లి శంకరయ్య, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు.