01-10-2025 01:40:22 AM
వెబ్ ఆప్షన్ల ప్రక్రియ షురూ
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) 1,388 గ్రూప్--3 పోస్టులకు సంబంధించి ప్రొవిజినల్ సెలక్షన్ లిస్ట్‌ను విడుదల చేసింది. మొత్తం 4,421 మందిని జనరల్, 81 మందిని స్పోర్ట్స్ కోటాలో ఎంపిక చేసింది. ఈ జాబితాలో.. ఎంపికైన అభ్యర్థులకు వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ మంగళవారం నుంచే మొదలైంది. ఎంపికైన అభ్యర్థులు తమకు కేటాయించిన సమయంలోపు వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవాల్సి ఉం టుంది.
ఈ ఆప్షన్లు ఎంచుకోవడానికి అక్టోబరు 10 సాయంత్రం 5:30 గంటల వరకు టీజీపీఎస్సీ అవకాశమిచ్చింది. అభ్యర్థులు గడువులోగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలని కమిషన్ సూచించింది. టీజీపీఎస్సీ గ్రూప్--3 పరీక్షలను గతేడాది నవంబర్ 17, 18 తేదీ ల్లో నిర్వహించారు. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2.67 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ మార్చి 14న విడుదలైన విషయం తెలిసిందే.
ప్రస్తుతం విడుదలైన ప్రొవిజినల్ సెల క్షన్ లిస్ట్, వెబ్ ఆప్షన్స్ ప్రక్రియతో నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. స్పోర్ట్స్ కోటా కింద 81 మందిని ఎంపిక చేశారు. అయితే స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్‌ను క్లెయిమ్ చేసుకున్న అభ్యర్థులందరికీ ఫార మ్-1, ఫారమ్-2తో పాటు అప్‌లోడ్ చేసిన క్రీడా సర్టిఫికెట్లను క్రీడాశాఖ ధ్రువీకరించిం ది. అయితే క్రీడాశాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేసిన 81 మంది అభ్యర్థులు వెబ్‌సైట్‌లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది.