13-10-2025 10:22:55 PM
నాగల్ గిద్ద: నాగల్ గిద్ద మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల ఐసిడిఎస్ సూపర్వైజర్ ప్రశాంతి ఆధ్వర్యంలో మండల స్థాయి పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. స్థానికంగా లభించే పౌష్టికాహారంపై అవగాహన కల్పించడం కాకుండా పౌష్టికార లోపం వల్ల జరిగే అనర్ధాలు మహిళలకు తెలియజేయాలనే పోషణ మాసం ప్రధాన ఉద్దేశం అని సీడీపీఓ సుజాత అన్నారు. ముఖ్యంగా గర్భిణులు చిన్నపిల్లలకు పౌష్టికాహార అవశ్యకతపై వివరించి ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సీడీపీఓ సుజాత, ఏసిడిపిఓ సుసియా, తాసిల్దార్ శివకృష్ణ, మండల విద్యాధికారి మన్మధ కిషోర్, సూపర్వైజర్ ప్రశాంతి, మంజుల తదితరులు పాల్గొన్నారు.