calender_icon.png 14 October, 2025 | 1:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తేజ రెడ్డి డెర్మటాలజీ అండ్ కాస్ఫోటాలజీ క్లినిక్ ప్రారంభం..

13-10-2025 10:29:00 PM

హనుమకొండ (విజయక్రాంతి): హనుమకొండ ఎన్జీవోస్ కాలనీ రోడ్డు, బస్టాండ్ రోడ్డులో ప్రముఖ వైద్యుడు, తేజ ఇంటర్నేషనల్ స్కూల్ అధినేత సుజన, రమణారెడ్డి తనయుడు డాక్టర్.సాయి తేజ రెడ్డి నిర్వహిస్తున్న క్లినిక్ లను ప్రముఖ విద్యావేత్త ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ ఎనగందుల వరదారెడ్డి, జనగామ ఎమ్మెల్యే పళ్ళ రాజేశ్వర్ రెడ్డి లు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం వరదారెడ్డి మాట్లాడుతూ హనుమకొండ పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య వరమైనటువంటి సేవలను, ప్రజలకు అందుబాటులో అందించాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చాడ స్వాతి రెడ్డి, ఏకశిలా విద్యాసంస్థల అధినేత తిరుపతిరెడ్డి, వాగ్దేవి విద్యాసంస్థల అధినేత దేవేందర్ రెడ్డి, రేసోనన్స్ విద్యాసంస్థల అధినేత రాజిరెడ్డి, బిఆర్ఎస్ నాయకులు రజనీకాంత్, రాజేందర్, దేవేందర్ రెడ్డి, నాగరాజు, రమేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.