calender_icon.png 14 October, 2025 | 1:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి

13-10-2025 10:26:06 PM

11 గేట్ల ఎత్తి గోదావరిలోకి నీటిని విడుదల..

చర్ల (విజయక్రాంతి): చర్ల మండలం తాలిపేరు మధ్య తరహా ప్రాజెక్టు వద్దకు సోమవారం సాయంత్రం భారీగా వరద నీరు చేరుకుంది. ఎగువ ఛత్తీస్‌గఢ్ తో పాటు స్థానికంగా కురిసిన భారీ వర్షం పడడంతో జలాశయానికి పెద్దఎత్తున వరద నీరు వచ్చి చేరుకుంది. దీంతో జలాశయంలో 11 గేట్లను ఎత్తి 21076 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువ గోదావరి విడుదల చేస్తున్నారు. తాలిపేరుకు 15077 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. తాలిపేరుతో పాటు పగిడి వాగు, రోటెంత వాగు, చింతవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టు వద్ద వరద పరిస్థితిని ఏఈ సుమన్ పర్యవేక్షిస్తున్నారు.