calender_icon.png 14 October, 2025 | 12:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం

13-10-2025 10:17:01 PM

బెల్లంపల్లి: హైదరాబాద్ కోఠీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కాన్ఫరెన్స్ హాలులో టి.సి.ఏ. రాష్ట్ర ఎస్సీ మాజీ అధ్యక్షులు ఎండల లక్ష్మీనారాయణ నేతృత్వంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు సోమవారం మంచిర్యాల జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు పైడిమల్ల నర్సింగ్ తెలిపారు. నూతన టిసిఏ రాష్ట్ర అధ్యక్షులుగా మాజీ పార్లమెంట్ సభ్యులు బి.బి. పాటిల్,   ప్రధాన కార్యదర్శిగా ధరం గురువారెడ్డి, ఉపాధ్యక్షులుగా డాక్టర్ ప్రేమ్ చందర్ రెడ్డి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా నుంచి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు పైడిమల్ల నర్సింగ్, కార్యదర్శి అల్లం వెంకటేశ్వర్లు, సంయుక్త కార్యదర్శి మడే రాజేష్, కో ఆర్డినేటర్ జాడి శేఖర్, కోచ్ అల్లం గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.