13-10-2025 10:13:36 PM
పుదుచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామి..
సంఘటన్ సృజన్ అభియాన్ లో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగం..
అచ్చంపేట: ప్రజలు అప్పగించిన నాయకత్వాన్ని.. ప్రజల మద్దతుతోనే ముందుకు వెళ్తున్నామని పుదుచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామి పేర్కొన్నారు. డీసీసీ అధ్యక్షుల నియామకం కోసం అచ్చంపేటలోని ఓ ఫంక్షన్ హాల్ లో సంఘటన సృజన అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పీసీసీ ఉపాధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మాజీ సీఎంతో పాటు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, ఏఐసీసీ పరిశీలకులు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు.
క్షేత్రస్థాయిలోని కార్యకర్తల అభిప్రాయాలకు అనుగుణంగా డీసీసీ అధ్యక్షుల నియామకం ఉంటుందని తెలిపారు. అందులో భాగంగానే జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకునేందుకు తాను పర్యటిస్తున్నట్టు మాజీ సీఎం వెల్లడించారు. జిల్లా నాయకత్వం బాధ్యతల కోసం పార్టీలోని కార్యకర్తలు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ప్రతి ఒక్కరితో నేరుగా మాట్లాడిన తర్వాతే తుది జాబితా సిద్ధం చేస్తామని చెప్పారు. కార్యకర్తల అభిప్రాయానికి అనుగుణంగా నివేదికను సిద్ధం చేసి టీపీసీసీ, ఏఐసీసీకి అందజేస్తామని తెలిపారు. టిపిసిసి పరిశీలకులు అమీర్ అలీ ఖాన్, సంధ్యారెడ్డి పాల్గొన్నారు.