13-10-2025 10:20:09 PM
జిల్లా కలెక్టర్..
కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మంజూరైన కేంద్రీయ విద్యాలయానికి సంబంధించి, తాత్కాలిక తరగతి గదుల నిమిత్తం పాత కొత్తగూడెంలోని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆనందఖని పాఠశాలలోని, భవన సముదాయాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ పరిశీలించారు. కేంద్రీయ విద్యాలయ సంఘటన్ బృందం, ఈ బృందం సూచించిన సూచనలకు అనుగుణంగా, పలు మార్పులు చేయాలని ప్రతిపాదనలో రూపొందించాలని ఇంజనీరింగ్ అధికారులను సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభ కల్లా, కేంద్రీయ విద్యాలయ తరగతి గదులు పూర్తి చేసి, తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని, జిల్లా విద్యాశాఖ అధికారులను, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ మానిటరింగ్, అధికారి ఏ నాగరాజు శేఖర్, విద్యాశాఖ ఇంజనీరింగ్ అధికారి రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సమీపంలోనే గురుకుల పాఠశాలను కూడా సందర్శించారు.