14-11-2025 03:45:20 PM
డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు
తుంగతుర్తి (విజయ క్రాంతి): సహకార సంఘం బలోపేతానికి కృషి చేస్తామని డీసీసీబీ డైరెక్టర్, పీఏసీఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు అన్నారు. శుక్రవారం తుంగతుర్తిలో రైతు సేవా సహకార సంఘం కార్యాలయం ముందు సహకార సంఘం వారోత్సవాల సందర్భంగా సంఘం జెండాను ఎగరవేసి మాట్లాడారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా సహకార సంఘం పని చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు మోడెం శ్రీలత, కేతిరెడ్డి రవీందర్ రెడ్డి, పెండెం యాదగిరి, కాకులారాపు బిక్షం రెడ్డి, రామనర్సమ్మ, ఎలగందుల రామచంద్రు, బండగొర్ల ఈదప్ప, సీఈవో శేర్ల యాదగిరి, సిబ్బంది గౌడిచర్ల మహేష్, తుమ్మ ఉమేష్ పాల్గొన్నారు.