calender_icon.png 22 December, 2025 | 4:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీల అభివృద్ధికి కృషి చేస్తా

22-12-2025 02:24:32 AM

జాతీయ బీసీ యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పీ. కార్తీక్ పటేల్

ముషీరాబాద్, డిసెంబర్ 21 (విజయక్రాంతి): జాతీయ బీసీ యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పి. కార్తీక్ పటేల్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య ఆదేశాల మేరకు కార్తీక్ పటేల్ ను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు జిల్ల పళ్లి అంజి తెలిపారు. ఈ సందర్భంగా కార్తీక్ పటేల్ కు ఎంపీ ఆర్. కృష్ణయ్య నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం నూతనంగా నియమితులైన కార్తీక్ పటేల్ మాట్లాడుతూ బీసీల అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

తనపై నమ్మకం ఉంచి జాతీయ బీసీ యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర కార్య నిర్వాహక  అధ్యక్షునిగా నియమించిన  జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్.  కృష్ణయ్య, రాష్ట్ర యువజన సంఘం  అధ్యక్షులు జిల్లపల్లి అంజి, సహకరించిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కో-ఆర్డినేటర్ డాక్టర్ ర్యాగ అరుణ్ కుమార్, జాతీయ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గవ్వల భరత్ కుమార్,    తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కంచిగారి ప్రవీణ్ కుమార్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ముదిరాజ్, బీసీ మిత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.