calender_icon.png 22 December, 2025 | 3:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెరపైకి నీటి సంఘాలు?

22-12-2025 02:25:32 AM

పునరుద్ధరణకు మార్గదర్శకాల రూపకల్పన

త్వరలోనే మంత్రివర్గ సమావేశంలో చర్చ 

ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి సంఘాల ఏర్పాటు రాష్ట్ర విభజన తర్వాత నిరాదరణకు గురైన వైనం 

పునరుద్ధరించేందుకు సీఎం ప్రత్యేక దృష్టి

హైదరాబాద్, డిసెంబర్  21 (విజయక్రాంతి) : సాగునీటి సంఘాలను పునరు ద్ధరించేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. చెరువులు, కాల్వల మరమ్మతులు,  నీటి విడుదల వంటివి నీటి సంఘాల పర్యవేక్షణలో ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. అత్యవసర సమయంలో మరమ్మతులు చేయించడంతో పాటు రైతులను చెరువులు, కుంటల నష్టాల నుంచి ఆదుకోకు న్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో చెరువులు, నీటి కాల్వల మరమ్మతులు వంటి పనులు సంఘాలు పరిధిలోనే జరిగేవి.

చెరువులు, కాలువల కింద కింద భూములు ఉన్న రైతులకు ఓటు హక్కు ఉండేది. నీటి సం ఘాలకు ఎన్నికలు నిర్వహించి చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లను ఎన్నుకునే వారు. అయితే, రాష్ట్ర విభజన తర్వాత నీటి సం ఘాలు నిరాదరణకు గురయ్యాయి.   మా రుతున్న పరిణామాలు, పెరిగిన నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని మళ్లీ నీటి సంఘాలను పునరుద్ధరించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

త్వరలో జరిగే మంత్రివర్గ సమావే శంలో వీటిపై చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొదటగా చెరువులు, కాలువల కింద సంఘాలు ఏర్పాటు చేసి, ఆ తర్వాత భారీ ప్రాజెక్టుల విస్తరించాలనే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకు విది విధానాలను ఖరారు చేస్తూ.. త్వరలోనే మార్గదర్శకాలు విడుదలవుతాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు.  

సాగునీటి ఇబ్బందులు తప్పుతాయని..

రైతుకు వర్షం, సాగునీరే జీవనాధా రం. పంట కోతకొచ్చే సమయంలో నీరు అందకపోవడం, లేదా అధిక వర్షాలు పడటం వల్ల రైతుల పంటలు మొత్తం దెబ్బతినడంతో  తీవ్ర నష్టం జరుగుతుంది. సరైన పద్ధతిలో నీటి వినియోగం లేకపోవడంతో పంట పొలాలకు సాగునీరు అందడం లేదు. ఇలాంటి విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పంటకు అవసరమయ్యేంత నీరు అందుబాటులో ఉండి, సమర్థవంతంగా వినియోగిస్తే అధి క దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది.

ఈ విధానం పునరుద్ధరిస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థతో పాటు రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. గ్రామాల్లో చెరువుల, కుంటలే ప్రధాన నీటి వనరులు కావడంతో.. వాటితో నిర్వణపై తగిన చర్యలు తీసుకోవడం వల్ల  సాగునీటికి ఇబ్బందులు తప్పుతాయని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. 

చెరువుల నుంచి క్రమేణ..

దీంతో సాగునీటి సంఘాలు ఏర్పాటు చేస్తే గ్రామాల్లో రైతులకు ఎంతో వెసులుబాటు, నీటిపై హక్కులు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. మొదటగా చెరువులతో ప్రారంభించి క్రమంగా పెద్ద ప్రాజెక్టులకు విస్తరించే ఆలోచనతో ఉన్నారు. ప్రతి సంఘానికి లష్కర్లను సిబ్బందిగా, నీటి పారుదల శాఖకు సంబంధించిన అధికారి కన్వీనర్‌గా నియమించనున్నారు. సాగునీటి సంఘాల ఏర్పాటు ద్వారా నీటి పారుదల శాఖకు సహకారం అందడంతో పాటు చెరువులు, కాల్వల నిర్వహణలో రైతులకు ప్రత్యక్షంగా భాగస్వామ్యం ఉంటుంది.

చిన్న నీటి వనరుల సంరక్షణకు వినియోగదారుల సంఘాలు పని చేయడమే కాకుండా క్రమం తప్పకుండా నిర్వహణ, మరమ్మతుల వంటి విషయాల్లో స్పందన లభిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తీసుకొచ్చిన చట్టం ఆధారంగా 1000 ఎకరాలకు పైగా ఉన్న ప్రధాన చెరువులకు 2006లో ఎన్నికల ద్వారా సాగునీటి వినియోగదారుల సంఘాలను ఏర్పాటు చేశారు. చెరువుల, కుంటల కింద ఉన్న రైతులను ఆయా సంఘాలకు సభ్యులుగా నియమించి ..

సాగునీటి పంపిణీ, చెరువులు, కాల్వల నిర్వహణ బాధ్యతలన్నీ ఎన్నికైన సభ్యులే చూసుకునేవారు. 2008 వరకు ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం 10,748 సాగునీటి వినియోగదారుల సంఘాలు ఉండేవి. అందులో 43 శాతం తెలంగాణలో ఉన్నాయి. నాడు రైతుల నుంచి ఈ వ్యవస్థపై మంచి స్పందన లభించింది. రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ఈ సంఘాలను రద్దయ్యా యి. ఇప్పుడు మళ్లీ  సాగునీటి సంఘాలు ఏర్పాటైతే.. సాగునీటి సమస్యలకు స్థానికంగానే పరిష్కార మార్గం దొరుకుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.