10 April, 2026 | 1:43 AM

బలహీనపడిన ‘ఫెంగల్’

02-12-2024 02:00 AM
  1. రెండు రోజులు వర్షాలు
  2. ఎల్లో అలర్ట్ జారీ

హైదరాబాద్, డిసెంబర్ 1 (విజయక్రాంతి): బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాను కోస్తా తమిళనాడు, పుదుచ్చేరి మీదుగా తీరం దాటింది. దీంతో ఆదివారం సాయంత్రం నాటికి తుపాను బలహీనపడి తీవ్ర వాయిగుండంగా మారినట్టు హైదారాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఫలితంగా రాష్ట్రంలో రాబోయే రెండు రోజులు వర్షాలు కురుస్తాయని చెప్పింది.

ము లుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని, ఈమేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్  జారీ చేసింది.

కాగజ్‌నగర్‌లో 3.2 మి.మీ. 

తుపాను ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షం కురిసిం ది. ఆదివారం కాగజ్‌నగర్‌లో అత్యధికంగా 3.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆసిఫాబాద్‌లో 2మిల్లీమీటర్లు, ఇబ్రహీంపట్నంలో 1.2మిల్లీమీట ర్ల వర్షపాతం నమోదైంది.