ఘనంగా ఈశ్వరీబాయి జయంతి
రవీంద్రభారతిలో నిర్వహణ పలువురు మంత్రులు హాజరు
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 1 (విజయక్రాంతి): రవీంద్రభారతిలో భాషా, సాం స్కృతిక శాఖ, ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఈశ్వరీబాయి జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే సామేలు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, జస్టిస్ చంద్రయ్య, ఈశ్వరీబాయి కుమార్తె, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు గీతారెడ్డి తదితరులు పాల్గొని ఈశ్వరీ బాయి చిత్రపటం వద్ద నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ దళితులు, వెనుకబడిన వర్గాల కోసం ఈశ్వరీబాయి చేసిన సేవలను కొనియాడారు. ఒక వైపు కుల వివక్షతను ఎదుర్కొంటూనే రాజకీయంగా ఆమె ఉన్నత శిఖరాలకు ఎదిగిన తీరును ప్రశంసించారు. కార్యక్రమంలో భాగంగా ఈశ్వరీబాయి ఫొటో ఎగ్జిబిషన్‌ను మంత్రులు తిలకించారు.




