08-08-2025 01:52:45 AM
అలంపూర్, ఆగస్టు 7 : అలంపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఒక మోస్తారు నుంచి మొదలై వాన సుమారు గంటకు పైగా ఎడతెరిపి లేకుండా కురిసింది.కాగా గత కొన్ని రోజులుగా సరైన వర్షాలు కురవక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని రైతులు దిగాలు చెందారు.ఈ వర్షంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు.అయితే కొన్నిచోట్ల వర్షపు నీరు పంట పొలాల్లో అధికంగా నిలవడంతో రైతులు కాస్త ఇబ్బంది పడ్డారు.