31-07-2025 12:42:27 AM
10 వేల మంది సిబ్బందికి చేకూరనున్న ప్రయోజనం
హైదరాబాద్, జూలై 30 (విజయక్రాం తి): కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)లు, సమగ్ర శిక్షా అభియాన్ (ఎ స్‌ఎస్‌ఏ)లలో పనిచేసే బోధనా కాంట్రాక్ట్, ఔ ట్ సోర్సింగ్ సిబ్బందికి పాఠశాల విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రాబోయే డీఎస్సీలో చేపట్టే ఉపాధ్యాయ నియామకాలలో 10 మార్కులు వెయిటేజీ ఇవ్వనుంది. విద్యాశా ఖ నిర్ణయంతో అందులో పనిచేసే సుమారు 10 వేల మందికి ప్రయోజనం చేకూరను ం ది.
ఈ మేరకు ప్రభుత్వానికి అధికారులు ప్ర తిపాదనలు పంపించారు. వైద్యారోగ్యశాఖ చేపట్టిన నియామకాల్లో ప్రభుత్వ ఆసుపత్రు ల్లో సేవలందించిన స్టాఫ్ నర్సులకు వెయిటే జీ కల్పించారు. ఇదే తరహాలో కేజీబీవీ, ఎస్‌ఎస్‌ఏలో పనిచేసే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ బోధనా సిబ్బందికి కూడా కల్పించాలని అధికారులు నిర్ణయించారు.
గ్రామీణా ప్రా ంతాల్లో ఏడాదికాలం పనిచేసిన వారికి 1.5 మార్కులు, పట్టణ ప్రాంతాల్లో వారికి 1.3, జీ హెచ్‌ఎంసీ పరిధిలో పనిచేసే వారికి ఒక మా ర్కు ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. అప్పట్లో వెయిటేజీపైన అధికారులు ఇచ్చిన హామీ మేరకు తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు.