8 April, 2026 | 1:52 AM

గిరిజనులకు సంక్షేమ పథకాలు అందాలి

08-04-2026 12:00 AM

గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ సంతోష్

ఉట్నూర్, ఏప్రిల్  7 (విజయక్రాంతి) : ప్రభుత్వ సంక్షేమ పథకాలు గిరిజనులు అందేలా చూడాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ సంతోష్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉట్నూ ర్ ఐటిడిఏ కార్యాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ప్రధానంగా గిరిజన విద్య, వైద్యంతో పాటు, వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు.

గిరిజన సహకార సంస్థ ద్వారా గిరిజన ఉత్పత్తుల కొనుగోలు, వృత్తి నైపుణ్య విభాగాల కార్యకలాపాలు, ప్రగతి, అమలు పరిస్థితులపై ఆరా తీశారు. కార్యక్రమాలను సమర్థ వంతంగా అమలు చేయడానికి సంబంధిత అధికారులకు దిశ నిర్దేశం చేశారు. అనంతరం ఇప్ప పువ్వు మౌహా లడ్డూ తయారీ యూనిట్ను సందర్శించారు.

కార్యక్రమంలో డి.డిలు అంబాజీ, రమాదేవి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అదనపు వైద్యాధికారి డాక్టర్ కుడిమెత మనోహర్, సి.ఈ బాలు, ఎస్.ఈ ఫణి కుమారి, జిల్లా ఉప విద్యాధికారి చంద న్,  పి.వి.టి.జి ఏపీఓ భాస్కర్, పార్థసారథి తదితరులుపాల్గొన్నారు.