9 May, 2026 | 8:15 AM

సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

09-05-2026 12:00 AM

మంత్రి వివేక్ వెంకట స్వామి

మందమర్రి, మే 8 : తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి కోరారు. శుక్రవారం మందమర్రి మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. అర్హులకు ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మందమర్రి, క్యాతన్పల్లి మున్సిపాలిటీల పరిధిలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.