calender_icon.png 11 May, 2025 | 6:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్‌హెచ్‌జీలకు బ్యాంక్ రుణాల్లో జిల్లాకు అవార్డ్

10-05-2025 01:02:22 AM

అభినందించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా 

సిరిసిల్ల, మే 9 (విజయ క్రాంతి): ఎస్ హెచ్ జీ లకు  బ్యాంక్ లింకేజీ రుణాలు అందించడంలో ఉత్తమ సేవలు అందించిన జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ బాధ్యులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అభినందించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి లక్ష్య సాధనలో భాగంగా ఎస్ హెచ్ జీ లకు  బ్యాంక్ లింకేజీ రుణాలు ఇప్పించిన జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు, సిబ్బందిని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అభినందించి, అన్ని విభాగాల్లో ప్రథమ స్థానంలో ఉండేలా కృషి చేయాలనిnఆకాంక్షించారు.

అనంతరం  ఆయన మాట్లాడుతూ  బ్యాంకులింకేజి ద్వారా స్వశక్తి సంఘ సభ్యులకు ఋణాలు ఇప్పించడంతో వారు ఆర్థికంగా ఎదుగుతున్నారని వివరించారు.  జిల్లాలో బ్యాంకులింకేజి 2024-25 సంవత్సరం నకు గాను లక్ష్యం 7969 సంఘాలు  రూ. 533.73 కోట్లు కాగా  4376 సంఘాలు  రూ,, 542.30 కోట్లతో  102% ప్రగతి సాధించినందున.. అలాగే ఫర్ గ్రూప్ ఫైనాన్స్ రూ 12.48 లక్షలు  ఇవ్వటంలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉండటం వలన  రాష్ట్ర స్థాయిలో  జిల్లాకు అవార్డు రావటం వచ్చిందని తెలిపారు.

పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క , ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్ కుమార్, సీఈవో సెర్ప్ దివ్య దేవరాజన్ నుంచి  డి ఆర్ డి ఓ, అదనపు డి ఆర్ డి ఓ, డిపిఎం తదితరులు, జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్ సరిత స్వీకరించారని తెలిపారు.

 99.74 శాతం రికవరీ....

బ్యాంకులింకేజి రికవరీ 99.74%, రాష్ట్రంలో జిల్లా రెండవ స్థానంలో ఉందని, 2023- 24 ఆర్ధిక సంవత్సరంలో కూడా లక్ష్య సాధనలో భాగంగా బ్యాంకు లింకేజి 106 శాతం సాధించినందుకు గాను జిల్లాకు అవార్డు ఇచ్చారని, ఎస్ హెచ్ జి లకు ఎంటర్ పైజేస్ గ్రౌండింగ్ 100 శాతం చేశారని కలెక్టర్ వెల్లడించారు.

రుణాలతో ఆర్థిక ప్రగతి..మహిళా సంఘాల బాధ్యులు జిల్లాలో బ్యాంకులింకేజి ద్వారా ఋణం తీసుకుని నూనె మిల్లులు, బిర్యాని పాయింట్స్, టిఫిన్ సెంటర్, పచ్చళ్ళు, మిల్లెట్స్ పిండి, లడ్డు ఇతర పదార్థాలు  , కిరాణం దుకాణాలు, బ్యూటి పార్లర్లు , సారీ సెంటర్స్, జిరాక్స్ సెంటర్స్ ,క్యాంటిన్, ఈవెంట్ మేనేజ్ మెంట్, డైరీ ఉత్త్పత్తులు, గేదెల పెంపకం వివిధ రకాల ఆధాయాభివృద్ది కార్యక్రమాల ద్వారా ఆర్థిక ప్రగతి సాదిస్త్తూ ముందుకు సాగుతున్నారని తెలిపారు.

ఆ పిల్లల ఉన్నత విద్యాభ్యాసానికి కూడా రుణాలు సద్వినియోగం చేసుకుంటున్నారని తెలిపారు.ఈ ఆర్ధిక సంవత్సరం కూడా ఇందిరా మహిళా శక్తి లక్ష్యం ఈ 2025-26 సంవత్సరం డిసెంబర్ లోపు పూర్తి చేసి రాష్ట్రంలో జిల్లాని ప్రథమ స్థానంలో ఉంచాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఏరా కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి శేషాద్రి, అదనపు అధికారి శ్రీనివాస్, డిపిఎంలు, సీసీలు, జిల్లా సమాఖ్య బాధ్యులు పాల్గొన్నారు.