20-03-2025 12:00:00 AM
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో మాట్లాడుతూ, తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు తొలగించి సురవరం ప్రతాప్‌రెడ్డి పేరు, అలాగే 55 సంవత్సరాల కిందటి బల్కం పేటలోని గాంధీ ప్రకృతి వైద్యశాలకు మాజీ సీఎం కొణిజేటి రోశ య్య పేరు పెట్టడానికి శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు.
వైశ్యులకు ప్రాధాన్యం తగ్గకుండా కొత్తగా చర్లపల్లిలో నిర్మించిన రైల్వే టెర్మి నల్‌కు కేంద్ర సహకారంతో ‘అమరజీవి పొట్టి శ్రీరాములు టెర్మినల్’గా నామకరణం చేయాలన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపుతున్నట్టు ప్రకటించారు.
పొట్టి శ్రీరాములు వైశ్యుల ప్రతినిధి కాదు, ఆయనను కులం గాటికి కట్టకూడదు. అయన విశ్వమా నవు డు. ప్రకృతి వైద్యం అంటే గాంధీ అని, గాంధీ అంటే ప్రకృతి వైద్యం అనే భావన అందరి మదిలో ఉంది. నాణేనికి బొమ్మ బొరుసు ఉన్న ట్లు గాంధీ పకృతి వైద్యం రెండు విడదీయరానివి. ఒక సంస్థ ప్రపం చ వ్యాప్తంగా వర్ధిల్లాలి అనుకుంటే దానికి ప్రేరణ ఇచ్చిన వ్యక్తి పేరు పెడితే బాగుంటుంది.
గాంధీ పేరు విశ్వవ్యాపితం, జాతిపిత పేరు తీసి రోశయ్య పేరు పెట్టడం సముచితం కాదు. ప్రకృతి వైద్యశాలలో ఇప్పటికీ పోస్ట్ గ్రాడుయేట్ కోర్సులు లేవు. ఈ మేరకు అక్కడ పరిశోధన విభాగం ఏర్పాటు చేసి దానికి రోశయ్య పేరు పెడితే సమంజ సంగా ఉంటుంది. ఇంకా అక్కడ జీవన శైలి కేంద్రం ఏర్పరచి, అందు లో ఆయన విగ్రహం నెలకొల్పాలి.
ఇలా కాకుండా, దేశ జాతిపిత పేరును తొలగించడం మనల్ని మనం దిగజార్చుకున్నట్లు అవుతుం ది. ఎన్నో ఏళ్లుగా వస్తున్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు అలాగే ఉంచి కొత్తగా నిర్మిస్తున్న టెర్మినల్‌కు సురవరం ప్రతాప్‌రెడ్డి పేరు పెట్టడం సమంజసం.
డా. యం.అఖిలమిత్ర