calender_icon.png 10 May, 2025 | 8:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యకు సరిపడని నిధులు!

20-03-2025 12:00:00 AM

ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యం లో దీర్ఘకాలిక అభివృద్ధి, సంక్షే మం, వ్యవసాయ, మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పన వంటి ప్రాధాన్య తాంశాల మేళవింపే  తాజాగా రాష్ట్ర ప్రభు త్వం ప్రవేశపెట్టిన బడ్జెట్. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలుకై ఈ బడ్జెట్‌లో నిధు లు కేటాయించడం విశేషం. ప్రత్యేకించి సంక్షేమ రంగానికి పెద్దపీట వే స్తూ వ్యవసాయం, మౌలిక సౌకర్యాలు, ఉపాధి కల్పనలకు ప్రాధాన్యతను ఇచ్చా రు.

వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 64,539 కోట్ల బహిరంగ మార్కెట్ రుణాలతోసహా దాదాపు 70,000 కోట్ల అంచ నా వేసిన రుణాలపై రాష్ట్రం నిరంతరం ఆధార పడటాన్ని బడ్జెట్ ప్రతిబింబిస్తున్నది. దీనినిబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉం దో మనకు అర్థం అవుతుంది. ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ప్రోత్సహిం చడానికి ఈ బడ్జెట్‌లో కేటాయింపులు పెంచడం శుభసూ చకం.

సోలార్, గ్రీన్ ఎనర్జీల వినియోగానికి రాయితీలు ప్రకటించాలి. మహిళా సాధికారతకు ఆర్థిక స్వావలంబనకు ఇంది రా మహిళా శక్తి మిషన్ ద్వారా మహిళల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకై చర్యలు ప్రారంభించడం గమనార్హం.

విద్యకు నిధులు తగ్గితే ఎలా?

వ్యవసాయం (24,439 కోట్లు), పంచాయితీరాజ్ (31,605 కోట్లు), విద్య (23,108 కోట్లు)కి ప్రధాన కేటాయింపులు జరిగాయి. వెనుకబడిన తరగతులు, షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల సం క్షేమం సహా బీసీ సంక్షేమం అకౌంటింగ్ 11,405 కోట్లు కాగా, ఎస్‌సీ సంక్షేమం (40,232 కోట్లు), ఎస్‌టీ సంక్షేమం (17,169 కోట్లు) కలిపి మొత్తం కేటాయింపులు 69,000 కోట్లతో సింహభాగం బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. 

రాష్ట్రం లో 56.39 శాతం ఉన్న బీసీలకు ఈ బడ్జెట్‌లో కేవలం రూ.11,405 కోట్ల నిధులు మాత్రమే కేటాయించారు. 56.39 శాతం ఉన్న బీసీలకు బడ్జెట్‌లో కేవలం 3.73 శాతం నిధులే కేటాయించడం ద్వారా బీసీ సంక్షేమం, అభివృద్ధి, సాధికారత ఎలా సాధ్యమవుతుందో పాలకులకే తెలియాలి. వైద్యరంగానికి ఈ బడ్జెట్‌లో రూ.12,393 కోట్లు కేటాయించారు. గత సంవత్సరం రూ.11,500 కోట్లతో పోల్చుకుంటే పెరుగుదల స్వల్పం.

మానవ అభివృద్ధి సూచిక లో ప్రధాన భూమిక పోషించే విద్య, వైద్య రంగాలకు ఈసారి కేటాయింపులు నామమాత్రంగానే జరిగాయి. ప్రపంచాన్ని చీకటి లో నుంచి విజ్ఞానం వైపు నడిపించే ఏకైక శక్తి విద్యకు మాత్రమే ఉందని నెల్సన్ మం డేలా అన్నారు. ఈ కోణంలో విద్యపై పెట్టి న సొమ్మును భవిష్యత్తుకి పెట్టుబడిగా చూ డాలి. కాని, గత దశాబ్ద కాలంగా రాష్ట్రంలో విద్యా రంగానికి కేటాయింపులు తగ్గుతూ వస్తున్నాయి.

2014 10.89 శాతంగా ఉన్న విద్యారంగ కేటాయింపులు ఈ సంవత్సరం 7.57 శాతం మాత్రమే. ఈ కేటా యింపుల్లో కూడా పాఠశాల విద్యకు కేటా యింపులు మరింతగా తగ్గాయి. విద్యాశాఖకు గత ఏడాదికంటే ఈసారి 0.20 శాతం కేటాయింపులు తగ్గడం గమనార్హం. మొత్తం రూ. 3,04,965 కోట్ల బడ్జెట్‌లో విద్యకు కేటాయించింది రూ.23,108 కోట్లు (7.57 శాతం). గత సంవత్సరం 27,4058 కోట్లను బడ్జెట్‌లో విద్యకు కేటాయించారు.

ఈ మేరకు గత సంవత్సరం కంటే కేటాయింపులు తగ్గిపోయాయి. దేశంలో ఈశాన్య రాష్ట్రాలుకూడా విద్యకు దా దాపు 12 నుండి 13 శాతం వరకు బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నాయి. తెలంగాణ బడ్జెట్‌లో విద్యా రంగానికిలో  23,108 (7.57 శాతం) కోట్లు కేటాయించారు.

దేశంలోని టాప్ 20 రాష్ట్రాలలో తెలంగా ణ రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి అత్యల్పంగా  నిధులను కేటాయించింది. డిల్లీ 21.1 శాతం, కర్ణాటక 11 శాతం, ఆంధ్రప్రదేశ్ (12.6 శాతం), కేరళ (14 శాతం), తమిళనాడు (14.1 శాతం) రాష్ట్రాలు మనకన్నా అత్యధిక నిధులు కేటాయించాయి. ఆ రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్ర విద్యారంగ కేటాయింపులు చాలా తక్కువ.

సింహభాగం ఉద్యోగుల వేతనాలకే!

విద్యకు 15 శాతం నిధులు బడ్జెట్‌లో కేటాయించి, ప్రభుత్వ బడులను పటిష్టం చేయడం ద్వారా రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ, విద్యకు  7.57 శాతం మా త్రమే బడ్జెట్‌లో కేటాయింపులు చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో విద్యకు కేటాయించిన సగటు బడ్జెట్ 14.7 శాతంలో ఈ కేటాయింపులు సగం మాత్రమే అని మనం గమనించాలి.

ఈ కేటాయింపుల్లో కూడా సింహభాగం ఉద్యోగుల వేతనాలకే ఉంటాయి. యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్‌కి రూ.2,900 కోట్లు ఈ కేటా యింపుల్లో ఉన్నాయి. విద్యాశాఖ పరిధిలో ఉన్న 26,067 పాఠశాలలను గాలికి వదిలేయడం బాధాకరం. రెసిడెన్షియల్, యం గ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ గురిం చి మాత్రమే ప్రభుత్వం మాట్లాడుతున్నది. గురుకులాల్లో చదివేది 5.5 లక్షల మంది మాత్రమే.

ప్రభుత్వ, జిల్లా పరిషత్, మం డల పరిషత్ పాఠశాలల్లో చదివే విద్యార్థులు 16 లక్షలు. వారిలో అత్యధికులు బడుగు, బలహీన వర్గాల బాల బాలి కలు. వీరికి నాణ్యమైన విద్యను అందించడానికి ఈ కేటాయింపులు ఏ మాత్రం సరిపోవు.

విద్యాశాఖ పరిధిలోని పాఠశాలల్లో మౌలి క వసతుల కల్పనకు, మెరుగైన మధ్యాహ్న భోజనం ఇవ్వడానికి, అదే సమయంలో నాణ్యమైన విద్యను అందించడానికి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా విద్యకు కనీసం 15 శాతం నిధులు కేటాయించాలి. 

మానవాభివృద్ధి సూచికలో 2022 లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రం దేశంలోనే 22వ స్థానంలో ఉంది. విద్య, వైద్యా నికి పెద్దపీట వేసిన రాష్ట్రాలు (కేరళ, గోవా, ఢిల్లీ) అభివృద్ధి సూచికలో ముందు వరుసలో ఉన్నాయి.

ప్రజల జీవన ప్రమాణా లు పెరిగేలా సంక్షేమ పథకాలను రూపొందిస్తూ, విద్య, వైద్య రంగాలకు రాబోయే ఐదు సంవత్సరాల్లో కేటాయింపులు మరింత పెంచాల్సిన అవసరం ఉంది. అప్పుడే మానవాభివృద్ధి సూచికలో మన రాష్ట్రం మరింత ముందుకు వెళ్తుంది. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథాన పయనిస్తుంది.

 వ్యాసకర్త సెల్: 9848377734