13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

ఉద్యమకారులకు ఇచ్చిన హామీలేమయ్యాయి?

31-03-2026 01:29 AM
  1. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోయింది
  2. ఉద్యమకారులకు ఇంకా న్యాయం జరగలేదు
  3. శాసనమండలిలో ఎమ్మెల్సీ విజయశాంతి

హైదరాబాద్, మార్చి 30 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన వాగ్ధానాలను వెంటనే నెరవేర్చాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారి కుటుం బాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని, నెలకు రూ.25 వేల అమరవీరుల గౌరవ పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చామని చెప్పారు.

అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోయిందని, ఉద్యమకారులకు ఇంకా న్యాయం జరగడం లేదన్నా రు. తమకు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారని ఉద్యమకారులు అడుగుతున్నారని చెప్పారు. ఉద్యమకారులపై ఉన్న కేసులు ఎత్తివేసి, ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇస్తామన్న హామీని అమలు చేయాలని కోరారు.