calender_icon.png 22 August, 2025 | 5:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేడుకలో ఉన్నది కాలం..

29-09-2024 01:29:15 AM


సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదలైన విషయం తెలిసిందే. కాగా మేకర్స్ శనివారం సెకెండ్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. ‘వేడుకలో ఉన్నది కాలం.. వేడుక ఈ కల్యాణం’ అంటూ సాగుతున్న ఈ గీతాన్ని జై క్రిష్ ఈ పాటకు స్వరాలు సమకూర్చగా సనాపతి భరద్వాజ పాత్రుడు సాహిత్యం అందించారు.

ఐశ్వర్య దరూరి, బృందా, చైతు సత్సంగి, అఖిల్ చంద్ర ఆలపించిన ఈ సాంగ్‌లో సుధీర్‌బాబు కూల్ ప్రజెన్స్ కట్టిపడేసింది. ఆర్ణ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సాయిచంద్, రాజు సుందరం, శశాంక్, ఆమని, అన్నీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 11న ఈ సినిమా విడుదల కానుంది.