12 June, 2026 | 12:59 PM

Breaking News

మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •   ప్రముఖ 'మాండ్' గాయని గావ్రీ దేవి కన్నుమూత   •   తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు ఎండలు   •   నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి   •   రోడ్డుప్రమాదంలో మేకల కాపరి, 20 మేకలు మృతి   •   వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన.. ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత   •   భార్య‌తో గొడ‌వ‌.. పిల్లలతో కలిసి నిజాంసాగ‌ర్‌లో దూకిన తండ్రి   •   నివాస భవనంలో అగ్నిప్రమాదం: ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు   •   షూటర్ జస్పాల్ రాణా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం   •  

వెండితెర కీర్తిపతాక పైడి జయ్‌రాజ్

29-09-2024 01:28 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): తెలంగాణ జాతి గర్వించదగిన అద్భుత కళాకారుడు, దర్శకుడు, నటుడు, నిర్మాత పైడి జయ్‌రాజ్ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కరీంనగర్ నుంచి మొదలై హైదరాబాద్ వ్యాయామశాలలో శిక్షణ పొంది, జాతీయ చలనచిత్ర సీమను ఏలిన గొప్ప నటుడు అని కొనియాడారు. జయ్‌రాజ్ 115వ జయంతి సందర్భంగా ప్రముఖ జర్నలిస్టు, నంది పురస్కార గ్రహీత పొన్నం రవిచంద్ర..

జయ్‌రాజ్ జీవితంపై రాసిన ‘ద ఫస్ట్ యాక్షన్ హీరో’ పుస్తకాన్ని సచివాయలంలో సీఎం శనివారం ఆవిష్కరించారు. సినీరంగంలో ఎదుగాలనుకునే తెలంగాణ యువ దర్శకులు, నటులు.. పైడి జయ్‌రాజ్ స్ఫూర్తితో ముందుకెళ్లాలని రేవంత్‌రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్టర్ మామిడి హరికృష్ణ, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.