05-07-2025 01:37:16 AM
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్
హైదరాబాద్, జులై 4 (విజయక్రాంతి): ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హైదరా బాద్ పర్యటనపై బీజేపీ రాష్ర్ట అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ తీవ్ర విమర్శలు చేశారు. ఇదో రాజకీయ నాటకమని ఆయన ఒక ప్రకటనలో ఆరోపించారు. ఖర్గే పర్యటనతో రాష్ట్ర ప్రజలకు ఏ ఉపయోగమూ లేదన్నారు. ఇది కాంగ్రెస్ ఇచ్చిన హామీలను మరిపించేందుకు చేస్తున్న ఆఖరి ప్రయ త్నం మాత్రమేనన్నారు.
రాష్ట్రం లో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా ఒక్క ప్రధాన హామీ కూడా అమలు కాలేదని విమర్శించా రు. అప్పట్లో సోనియా, రాహుల్ గాంధీ లు ప్రజలను మోసగించారని... ఇప్పు డు ఖర్గే మాటలతో మళ్లీ మాయ చేయాలనుకుంటున్నారని ఆరోపించా రు.
కర్ణాటకలో సీఎం సిద్ధరామ య్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య సాగుతున్న విభేదాలపై మాట్లాడే అధికారమే మీ తనకు లేదని తేల్చిన ఖర్గే... తెలంగాణకు ఏం న్యాయం చేయగలడని ప్ర శ్నించారు. ఖర్గే పర్యటన స్థానిక సంస్థల ఎన్నికల ముందు చేస్తు న్న ప్రచార ఆర్భాటమేనని ఎద్దేవా చేశారు.