calender_icon.png 5 July, 2025 | 8:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్ తమకు దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామి

05-07-2025 01:35:43 AM

  1. భారత్ వ్యాపార సంబంధాలు బలపర్చడమే లక్ష్యం
  2. రాకెజ్ గ్రూప్ సీఈవో రమీ జల్లాద్

హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): భారతదేశం తమకు కేవలం ప్రధానమైన మార్కెట్ మాత్రమే కాద ని, ఒక దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వా మి అని యూఏఈకి చెందిన రాస్ అల్ ఖైమా ఎకానమిక్ జోన్(రాకెజ్) గ్రూప్ సీఈవో రమీ జల్లాద్ స్పష్టం చేశారు. జూలై 7వ తేదీన హైదరాబాద్‌లో ఎక్స్‌ప్యాండ్‌మీ బిజినెస్ ఈవెంట్‌ను రాకెజ్ గ్రూప్ ప్రారంభించబోతోంది.

ఈవెంట్ వేదికగా భారత్ వ్యాపార సంబంధా లను మరింత బలపరిచే లక్ష్యంతో వరల్డ్ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కౌన్సిల్(డబ్ల్యూటీఐటీసీ)తో వ్యూహాత్మక ఒప్పం దం చేసుకుంది. ఈ సందర్భంగా రమీ జల్లా ద్ శుక్రవారం ఒక ప్రకటనలో స్పందిస్తూ డబ్ల్యూటీఐటీసీతో చేసుకునే ఒప్పందంతో భారత వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే మార్గాన్ని సుగమం చేయాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు.

డబ్ల్యూటీఐటీసీ వ్యవస్థాపక అధ్యక్షుడు సందీప్ మక్తాల స్పంది స్తూ.. రాకెజ్ నిర్వహించే ఎక్స్‌ప్యాండ్‌మీ ఈవెంట్ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే స్టార్టప్‌లు, వ్యాపారవేత్తలకు ప్రపంచవ్యాప్త వ్యాపార అవకాశాలకు గేట్‌వే అవుతుందని అభిప్రాయపడ్డారు. దీంతోపాటు భారత్‌లో రాకెజ్ విస్తరణకు ఇది బలమైన ఆరంభమవుతుందని తెలిపారు.