18 August, 2026 | 7:58 PM

Breaking News

సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త సర్వాయి పాపన్న గౌడ్   •   సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం   •   ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే ఫోకస్‌.. అధికారులకు క్లాస్‌   •   పాలిటెక్నిక్ విద్యార్థుల ర్యాలీ.. రాస్తారోకో   •   చెన్నూర్ లో ఘనంగా పాపన్న గౌడ్ జయంతి వేడుకలు   •   పశు పోషణ యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కార్యక్రమం   •   సేంద్రియ వ్యవసాయంతో లాభాలు   •   ఈనెల 19న జిల్లాకు ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య   •   ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు   •   అర్జున అవార్డులకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు   •  

షాద్ నగర్ ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలి

08-12-2024 12:04 AM

పోలీసులకు ఫిర్యాదు చేసిన వెల్మ సంఘం నాయకులు...

ఆదిలాబాద్ (విజయక్రాంతి): వెలమ సామజిక వర్గాన్ని అసభ్య పదజాలంతో దూషించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా వెల్మ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ మనీషా మాట్లాడుతూ.. షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు వీర్లపల్లి శంకర్ వెలమ సామాజిక వర్గాన్ని అసభ్య పదజాలముతో దూషిస్తు వెలమ కులస్తుల అంతు చూస్తమని బెదిరించడం జరిగిందన్నారు. ఈ విషయంలో ఒక బాధ్యతయుతమైన పదవిలో ఉండి ఈ విధంగా ప్రవర్తించడం ఎంత మాత్రము సమంజసము కాదన్నారు. ఎమ్మెల్యే వాడిన భాషవల్ల వెలమ సామజిక వర్గనికి చెందిన మా అందరి మనోభావాలు దెబ్బతినడం జరిగిందన్నారు. అహంకార పూరితంగా ఒక సామాజిక వర్గంపై ఈ విధమైన దూషణలు, బెదిరింపులు చేయడం ఏమాత్రము ఉపేక్షించెవి కావని పేర్కొన్నారు. కావున ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన బాధ్యత రాహిత్యమైన ఈ వ్యఖ్యలపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.