14-06-2025 12:50:07 AM
ఇన్నాళ్లుగా ఉన్న అసంతృప్తి ఇప్పుడు తొలగిపోయిందని చెబుతోంది మలయాళ బ్యూటీ అనంతికా సనీల్‌కుమార్. ఈ ముద్దుగుమ్మ ప్రధాన పాత్రలో దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి తెరకెక్కిస్తున్న కాన్సెప్ట్- సెంట్రిక్ మూవీ ‘8 వసంతాలు’. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవికుమార్ నిర్మిస్తున్నారు. జూన్ 20న విడుదల కానున్న ఈ చిత్రం నుంచి ఇటీవల సెకండ్ సింగిల్ ‘పరిచయమిలా..’ను రిలీజ్ అయ్యింది. ఇలా వరుస ప్రచార కార్యక్రమాలతో చిత్రబృందం ప్రేక్షకులకు చేరువుతోంది.
తాజాగా కథానాయిక అనంతిక, డైరెక్టర్ ఫణీంద్ర ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనంతిక తన గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. “కరాటేలో బ్లాక్‌బెల్ట్ చేశాను. మోహినీ అట్టంతోపాటు పలు నృత్య కళల్లోనూ ప్రావీణ్యం సాధించాను. ఇప్పుడు భరతనాట్యం నేర్చుకుంటున్నా. నటన వైపు వచ్చి, ఇంతకాలంగా మంచి సినిమాలు చేస్తూనే ఉన్నప్పటికీ నటిగా నాలో ఏదో తెలియని అసంతృప్తి వెం టాడేది. ఇంకా వెలుగులోకి రా లేకపోతున్నాని అనుకునేదా న్ని. నటిగా నేను రాణించగలనా అనుకున్నా. కానీ, ‘8 వసంతాలు’ నాకు చాలా సంతృప్తినిచ్చిన సినిమా. ఈ సినిమాతో నా చు ట్టూ ఉన్న చీకటి తొలగిపోయిందనిపి స్తోంది” అని తెలిపింది.