calender_icon.png 15 May, 2025 | 11:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదోడి సొంతింటి కల నెరవేరిన వేళ

15-05-2025 12:47:41 AM

ఇందిరమ్మ ఇండ్లకు భూమిపూజ చేసిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు

ఎల్లారెడ్డి, మే 14 : గత 20 సంవత్సరాల నుండి కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ పేదలు సొంత ఇంటి కల కలగనే మిగిలిపోయింది. గత ప్రభుత్వ పాలకుల అసమర్థ పాలన వల్ల ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా నిర్మించలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల వ్యవధిలోనే నియోజకవర్గానికి 3500 డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు అయ్యాయి.

అందు లో భాగంగా మంగళవారం ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని 7వ వార్డులో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పది మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేసిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్, పేదల ఇంటి కలను సాకారం చేసే దిశగా ముందడుగు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ ప్రజలకు సొంత ఇంటి ఉండడం ఒక కల.

ప్రజలు అం దరు తమకు సొంత ఇల్లు ఉండాలని కోరుకుంటారు. మంగళవారం  10 మంది లబ్ధి దారులకు సొంత ఇంటి నిర్మాణం కొరకు భూమి పూజ చేసినందుకు మంజురు పత్రాలను అందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు, ఎల్లారెడ్డి మండల అధ్యక్షులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

రైతుల అవసరాల కోసం గోదాముల నిర్మాణం..

రైతుల ప్రయోజనం కోసం గోదాముల నిర్మాణం చేపడుతున్నట్లు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం లోని గాంధారి మండలం పెట్ సంఘం గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో 13 లక్షలతో 150 మెట్రిక్ సామర్ధ్యం గల గోదాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్  మాట్లాడుతూ, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని గోదాముల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో విండో చైర్మన్ సాయికుమార్, వైస్ చైర్మన్ ఉదాల్ సింగ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోహన్, గాంధారి %జు్పు% చైర్మన్ బండారి పరమేష్, వైస్ చైర్మ న్ ఆకుల లక్ష్మణ్,

విండో డైరెక్టర్ తాడ్వాయి సంతోష్ కుమార్, తూర్పు రాజులు,పేట్ సంగేమ్ గ్రామ కాంగ్రెస్ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గణపతి, ముకుందరావు, లక్ష్మణ్, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రైతుల కోరిక మేరకు అదనపు ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు.. 

కామారెడ్డి, మే 14 (విజయక్రాంతి) : రైతుల కోరిక మేరకు అదనపు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం జరిగిందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తెలిపారు. బుధవారం కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పెద్ద పోతంగల్ గ్రామంలో 33/11 కేవీ సబ్ స్టేషన్ లో 3. 15 కేవీఏ ట్రాన్స్ఫార్మర్ కావాలని పెద్ద పోతంగల్, చిన్నపోతంగల్ గ్రామ రైతులు కోరడంతో అదనంగా 3.15 కె వి ఏ ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయించి అమర్చడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో ట్రాన్స్కో ఎస్ ఈ శ్రావణ్ కుమార్ స్థానిక ట్రాన్స్కో అధికారులు, రైతులు పాల్గొన్నారు.

ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తాం.. 

పజలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. బుధవారం సాయంత్రం కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం బానాపూర్ సబ్ స్టేషన్ లో కోటి రూపాయల నిధులతో ఏర్పాటుచేసిన 3.5 ఎన్ వి ఏ పిటిఆర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

లో ఓల్టేజీ సమస్య ఉండవద్దని ఉద్దేశంతో సమ్మర్  యాక్షన్ ప్లాన్ లో పొందుపరిచి 3.15 ఎం వి ఏ పి టి ఆర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యుత్ శాఖ అధికారి శ్రావణ్ కుమార్ డివిజనల్ ఇంజనీరు, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ లు, ఏఈలు, లైన్ ఇన్స్పెక్టర్ లు  రైతులు, ఆయా గ్రామాల ప్రజలు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

శివనామస్మరణతో ప్రశాంతత..

శివనామస్మరణతో మనిషికి ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో బుధవారం నారాయణ గిరి వద్ద మార్కండేయుని ఆలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేకపూజలు నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు, పద్మశాలి కులస్తులు, తదితరులు పాల్గొన్నారు.