18 April, 2026 | 8:41 AM

వివాహ వేడుకల్లో పాల్గొన్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే

15-05-2025 12:44 AM

నిజాంసాగర్, మే 14 : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామపంచాయతీ పరిధిలోగల లింగంపల్లిగ్రామం లో కురుమ రాములు కుమారుని వివాహ వేడుకల్లో  బుధవారం జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే  పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. మాగి గ్రామానికి చెందిన  ఎల్లయ్య కుమార్తె నూతన వస్త్రాలంకరణ కార్యక్రమంలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు.

బిచ్కుంద పట్టణ కేంద్రం లో అవార్ వార్ వెంకట్  నూతన గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. పిట్లం మండలంలోని బండపల్లి గ్రామంలో జరిగే వివాహ వేడుకలో  పాల్గొని నూతన వదు వరులను ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో  బీ ఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సి డి సి చైర్మన్  దుర్గారెడ్డి, పిట్లం    మాజీ ఎంపీపీ రజినీకాంత్ రెడ్డి,బొల్లి సహాదేవ్ ,బిచ్కుంద  మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గణేష్ గొండ, బస్వారాజ్, తానజీ, రవి మనోహర్, పిట్ల సత్యనారాయణ, మార్పల్లి రాములు, కమ్మరి కత్తా అంజయ్య, కుర్మా గంగారాం తదితరులు పాల్గొన్నారు.