11 May, 2026 | 5:15 AM

తనిఖీలు కాగితాలకే పరిమితమా?

10-05-2024 12:05 AM

తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో భారీ సంఖ్యలో డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు, ఇతర అధికారులు ఉన్నప్పటికీ గ్రామీణ స్థాయినుంచి జిల్లాస్థాయిలో రోగులకు సరైన న్యాయం జరగడం లేదు. మెడికల్ షాపులకు లైసెన్స్ మంజూరులోనూ ప్రభుత్వ నిబంధనలను పలువురు తుంగలో తొక్కుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. నకిలీ లేదా జనరిక్ మందులను అమ్ముతున్నట్టు ఫిర్యాదులు వున్నాయి. డాక్టర్లు, మెడికల్ షాప్ యజమానులు కుమ్మక్కవడం, డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు తనిఖీలు చేసికూడా చర్యలు తీసుకోకుండా అవినీతికి పాల్పడటం వంటివి జరుగుతున్నట్లు తెలుస్తున్నది. ఇలాంటి వారిపై ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. కెమిస్ట్స్, డ్రగ్స్ ట్రేడర్లు విచ్చలవిడిగా ఔషధాలను అమ్మేస్తున్నట్టు సమాచారం. దీనివల్ల పేషంట్లకు సైడ్ ఎపెక్స్ వస్తుంటాయి. క్వాలిఫైడ్ పార్మసిస్టు లేకుండానే మెడికల్ షాపులు నడపడం చట్ట వ్యతిరేకం.

రావుల రాజేశం, హైదరాబాద్