చేపపిల్లలు ఎక్కడ?
వర్షకాలం రాబోతున్నా టెండర్ల ఊసెత్తని ప్రభుత్వం
ఉచిత పంపిణీని కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేస్తుందా?
సూర్యాపేట, మే 30 (విజయక్రాంతి): ఈ ఏడాది చేప పిల్లలు చెరువుకు చేరుతాయా? మత్స్యకారులకు ఉచిత చేప పిల్లలు అందు తాయా? అనే అనుమానాలు వ్యక్తమ వుతున్నాయి. రాష్ట్రంలో ఏటా వర్షాకాలానికి ముందే చేప పిల్లలకు టెండర్లు పిలిచి సీజన్ మొదలయ్యే నాటికి పిల్లలను సిద్ధం చేసి చెరువులో వదిలే వారు. దీంతో మత్స్యకారులకు లాభదాయకంగా ఉండేది. గత కొన్ని ఏళ్లుగా మే నెలలో ఉచిత చేపపిల్లల పంపిణీకి టెండర్లు పూర్తి చేసేవారు. జూలై నుంచి సెప్టెంబర్ వరకు వాటిని చెరువుల్లో వదిలేవారు.
కానీ ఈ ఏడాది మే నెల పూర్తవుతున్నా టెండర్ల ప్రక్రియ కూడా ప్రారంభం కాలేదు. అంతేకాకుండా వర్షకాలం సమీపిస్తున్నా ఈ ఏడాది చేపపిల్లల పంపిణీ పథకం కొనసాగింపుపై ప్రస్తుత ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వడంలేదు. దీంతో ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంపై నీలినీడలు అలుముకుంటున్నాయి. గత ప్రభుత్వం మత్స్యకారులకు ఆర్థిక తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో ఉచిత చేపపిల్లలు పంపిణీ చేసింది. ఏటా వర్షకాలానికి ముందే చేప పిల్లల కోసం టెండర్లను పిలిచి కాంట్రాక్టర్లును ఖరారు చేసేది. వర్షాలు పడి చెరువులు నిండగానే చెరువులో చేప పిల్లలను వదిలేవారు. కానీ ప్రస్తుతం ఆ దిశగా అడుగులు పడుతున్నట్లు కనబడటం లేదు. ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందా? లేదా? తెలియని పరిస్థితి నెలకొన్నది.
గతేడాది 3.50 కోట్ల చేపపిల్లల పంపిణీ
సూర్యాపేట జిల్లాలో 134 ప్రాథమిక మత్స్య పారిశ్రామిక సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో 1,340 చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల్లో గత ఏడాది చిన్న సైజు (40 ఎం.ఎం), పెద్ద సైజు (80 ఎం.ఎం) మొత్తం కలిపి 3.50 కోట్ల చేప పిల్లలను చెరువుల్లో వదిలారు. ప్రభుత్వం ఉచితంగా అందించే చేప పిల్లలతో పాటు మత్య్సకారులు మరి కొన్ని చేప పిల్లలను కొనుగోలు చేసి వదిలేవారు. వీటి ద్వారా మత్స్యకారులకు భారీగానే ఆదాయం లభించింది. అయితే, ఈ పథకం అమలులో జిల్లా వ్యాప్తంగా గతంలో అనేక ఆరోపలు వచ్చాయి.
గతేడాది చేపపిల్లల సరఫరాకు జూన్ 17 టెండర్లకు ఆహ్వానిస్తే రాజకీయ కారణాలతో సెప్టెం బర్ మొదటి వారంలో ఫైనల్ చేశా రు. సెప్టెంబర్ చివరి వారం నుంచి చేపపిల్లల పంపిణీ ప్రారం భం కాగా చాలాచోట్ల నాసిరకం పిల్లలను ఇస్తున్నారని మత్స్యకారులు అడ్డుకు న్నారు. రాజకీయ కారణాలతో అధికారులు స్పందించలేదు. ఇదే సమ యంలో ఎన్నికల కోడ్ రావడంతో పట్టించుకునే వారే లేకుండా పోగా అనుకున్న స్థాయిలో చేపపిల్లలను వదులకపోగా లెక్కల్లో మాత్రం లక్ష్యం చేరుకుంటున్నట్లు చూపారు.






