18-11-2025 12:37:24 AM
- పల్లెల్లో పేరుకుపోయిన పారిశుద్ధ్యం
- నిద్రావస్థలో పంచాయతీ కార్యదర్శులు
- రోగాల బారిన పడుతున్న ప్రజలు
కొల్చారం, నవంబర్ 17 :జ్వరమొస్తే.. గోలి వేసుకునే రోజులు కావు...డెంగ్యూ, మ లేరియా, టైఫాయిడ్, వంటి విష జ్వరాలు కా పు కాసే కాలమిది. ఎలాంటి వ్యాధులైనా మొదట జ్వరంతో మొదలై అలసత్వాన్ని చూ పితే.. ప్రాణాలను హరిస్థాయి. ప్రతియేటా వ ర్షాకాలంలో సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు పరిసరాల పరిశుభ్రత, పిచ్చి మొక్కల తొలగింపు, దోమల నివారణకు పంచాయతీల వారీగా శుభ్రత పనులను ముమ్మరం చే సేవారు. ఈసారి కొల్చారం మండలంలోని ఏ పంచాయతీల్లో కూడా పారిశుద్ధ్య పనులు సాగుతున్న దాఖలాలు కనిపించడం లేదు. గ్రామాల్లో ము రికి నీటి నిల్వలు, చెత్తాచెదారంతో పేరుకుపోయి ఉండడం తో వర్షాల వల్ల మరిం త అధ్వాన్న పరిస్థితి నెలకొంది.
సీజనల్ వ్యా ధులు నిద్రలేస్తున్న వేళ పంచాయతీల ప్రత్యే క అధికారుల నిర్లక్ష్యం, కార్యదర్శులు స్థానికంగా నివాసం ఉండక పోవడం వల్ల పారిశు ద్ధ్య పనుల్లో జాప్యం జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో ఇప్పటివ రకు బ్లీచింగ్ చల్లడం, ఆగి ఉన్న నీళ్లలో దో మల లార్వా పెరగకుండా ఆయిల్ బాల్స్ వదలడం వంటి పనులు పూర్తిస్థాయిలో మొదలు కాలేదంటే అధికారుల అలసత్వం ఏ పాటిదో ఇట్టే అర్థమవుతుంది.
మారుమూల పంచాయితీల పరిస్థితి మరింత అ ధ్వాన్నంగా మారింది. పొంచి ఉన్న ప్రమా దం నేపథ్యంలో అతి కొద్దిమంది సిబ్బంది తో రోజుల తరబడి పారిశుద్ధ్య పనులు చే యించడం కంటే ఇలాంటి రోజుల్లో అదనంగా మరి కొంతమందిని తీసుకోవడం ద్వారా ప్రమాదాన్ని దరిచేరనీయకుండా చే యవచ్చనే అభిప్రాయాలు సర్వత్ర వ్యక్తమవు తున్నాయి. ఇక ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వా రానికి ఒకరోజు నిర్వహించే ఫ్రైడే డ్రైడే వంటి కార్యక్రమాలతో వ్యాధుల నివారణ సాధ్యమవ్వడం గాలిలో దీపం లాంటిదే. ఇప్పటికై నా పంచాయతీ ప్రత్యేక అధికారులు అలసత్వం వీడి గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారిం చకుంటే ముప్పు పెనుముప్పుగా మారే ప్ర మాదం లేకపోలేదు.
చర్యలు తీసుకుంటాం...
గ్రామాల్లో పారిశుద్ధ్యం పనులు ఎప్పటికప్పుడు చేపడుతున్నాం. ఎక్కడైనా స మస్య ఉంటే కార్యదర్శులు చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తాం. జిల్లా వ్యాప్తంగా ఇదే సమస్య నెలకొని ఉంది. అయినా తమవంతు బాధ్యతను నిర్వహిస్తాం.
కృష్ణవేణి, ఎంపీవో, కొల్చారం