calender_icon.png 7 October, 2025 | 4:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

107.3 ఎకరాల ప్రభుత్వ భూమి జాడ ఎక్కడ?

07-10-2025 01:08:33 AM

- కబ్జా కోరల్లో 817/1 సర్వే నంబరు భూములు 

- చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు 

-జిల్లా కేంద్రంలోని దారుణం 

- ప్రభుత్వ అవసరాలకు భూమి కరువు 

భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్ 6 (విజయక్రాంతి):ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టిన క్షేత్రస్థాయిలో కొందరు అవినీతి అధికారుల కార ణంగా ప్రభుత్వ భూమి కబ్జాకోరుల చేతుల్లో బంది అవుతోందని సర్వత్రా ఆరోపణలు వినిపిస్తున్నాయి. పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచలో భూముల విలువ పెరగడంతో కబ్జాదారులు దొడ్డి దారిన అక్రమాలకు తెరలేపుతున్నారు. కొందరు అవినీతి అధికారు లకు అడిగినంత సమర్పించి తప్పుడు సర్వే నెంబర్ల పేరుతో ప్రభుత్వ భూములను కొల్లగొడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ అవసరాలకు భూమి కరువకుతోంది. ప్రభు త్వ లెక్కల ప్రకారం 817/1, ఖాతా నెంబర్ 1704 లో 107.3 ఎకరాల భూమి ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.

ఇదంతా ప్రభుత్వ భూమి అని రెవెన్యూ అధికారులు స్పష్టంగా రికార్డుల్లో చూపుతున్నారు. క్షేత్రస్థాయిలో ఆ భూమి ఎక్కడా కనిపించడం లేదని, కబ్జా కోరల్లో చిక్కుకుందని ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ అవసరాలకు, విలేకరులకు ఇంటి స్థలాలకు, ఇతర అభివృద్ధి పనులకు భూమిలేదని రెవెన్యూ అధికారులు చెప్తున్నారంటే, 107.3 ఎకరాల భూమిని కాకులెత్తక పోయాయా అంటూ చలోక్తులు విసురుతున్నారు. జిల్లా కలెక్టర్ కల్పించుకొని సర్వేనెం బర్ 817/1 లో గల ప్రభుత్వ భూమి ఎవరికి కేటాయించారు, ఎవరి స్వాధీనంలో ఉందో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వ భూమిని పట్టాభూమిగా చూపి కొందరు పెద్ద మనుషులు దర్జాగా ఆక్రమించుకొని నిర్మాణాల పూర్తి చేయడం, మరికొన్ని నిర్మాణంలో ఉన్నట్లు తెలుస్తోంది.

రెవెన్యూ మంత్రి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి కావడం, ప్రభుత్వ భూమి పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉన్నం దున మంత్రి చొరవ చూపి 817/1 సర్వే నంబర్ ప్రభుత్వ భూమిని పారదర్శకంగా సర్వే నిర్వహిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, పేదవాడికి ఇంటి స్థలాలకు, ప్రభుత్వ కార్యాలయాల అవసరాలకు ఉపయోగపడుతుందని ప్రజలు కోరుతున్నారు. పేదవాడి ఇంటికి గజం భూమి ఉండదు కానీ, బడా బాబుల అక్రమ నిర్మాణాలకు మాత్రం ఎకరాల కొద్ది ప్రభుత్వ భూమి ఎక్కడ నుంచి వస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. తక్షణమే 817/1 లో సర్వే చేపట్టాలని పాల్వంచ పట్టణ, మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోనే ఇంత దారుణం జరుగుతున్న రెవెన్యూ అధికారులు నిమ్మకు నేరెత్తినట్లు వ్యవహరిస్తు న్నారంటే ప్రభుత్వ పాలన ఏ రీతిలో ఉందో అద్దం పడుతుందని ప్రభుత్వం పై విమర్శలూ వెలువడుతున్నాయి. 

అటు పంచాయితీ... ఇటు పంచాయితీ నడిమిట్లో మున్సిపాలిటీ? 

నువ్వా దరనీ. ... నేనీ దరినీ ఇద్దరినీ కలిపింది మున్సిపాలిటీ అన్నట్లు ఉంది పాల్వంచ మున్సిపల్ కార్పొరేషన్, రెవెన్యూ అధికారుల తీరు. ఒకవైపు బసవతార కాలనీ పంచాయతీ, మరోవైపు కేశ్వాపురం పంచాయతీ రెండింటి నడుమ పాల్వంచ మున్సిపల్ కార్పొరేషన్. 

ఇదేమి చోద్యం అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. గతంలో పనిచేసిన తాసిల్దార్ సైతం ఈ ప్రాంతం పంచాయతీ పరిధిలోకి వస్తుందని కోర్టులో కౌంటర్ దాఖలు చేసిన ఫలితం లేకుండా మున్సిపాలిటీగా ఉందని చెప్పడం ప్రతి ఒక్కరినే ఆశ్చర్యం కల్పిస్తోంది. కలెక్టర్, జిల్లా మంత్రి కల్పించుకొని ప్రభుత్వ భూములను పరిరక్షించాలని రెండు పంచాయతీల ప్రజలు కోరుతున్నారు.