calender_icon.png 13 February, 2026 | 12:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపాలిటీల్లో జెండా ఎగిరేసేది ఎవరు!

13-02-2026 12:00:00 AM

  1. బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం
  2. సిరిసిల్లాలో కీలకం కానున్న స్వతంత్రులు
  3. వేములవాడ త్రిముఖ పోటీ

రాజన్న సిరిసిల్ల ఫిబ్రవరి 12 (విజయ క్రాంతి): జిల్లాలో మునిసిపల్ ఎన్నికలపై ప్రత్యేకం.హోరెత్తిన మైకులు.ప్రలోభాల ఏరా లను దాటుకొని రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలింగ్ అభ్యర్థుల భవితవ్యం ప్రస్తుతానికి బ్యాలెట్ బాక్సుల్లో భద్రంగా ఉంది.జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపా లిటీలో ఎవరు జెండా ఎగిరేస్తారని అంశంపై ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా జరగడమే అధికారులు.

తెలిపారు. సిరిసిల్ల మున్సిపాలిటీ పరి ధిలో మొత్తం 39 వార్డుల్లో 117 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా ఓటింగ్ నమోదు అ యింది. అత్యధికంగా మహిళలు ఓటు హ క్కు వినియోగించుకోవడం గమనించవచ్చు. ముఖ్యంగా సిరిసిల్ల మున్సిపాలిటీలో ప్రధా న పార్టీలైన కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి,భారతీయ జనతా పార్టీతో పాటు, స్వతంత్ర అభ్యర్థులు పోటీపడ్డారు.ఎవరి లెక్క లు వారికి ఉన్నాయి.

సిరిసిల్ల మున్సిపల్ పీఠం దక్కించుకునేందుకు రాజకీయ పార్టీ లు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నా యి. గత మున్సిపాలిటీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ 22, బిజెపి 3, కాంగ్రెస్ 2 కౌన్సిలర్ అభ్యర్థులను గెలుచుకున్నాయి. సిరిసిల్ల మున్సిపల్ పీఠంపై అప్పట్లో భారత రాష్ట్ర సమితి జెండా ఎగురవేసిన విషయం తెలిసిందే.ఈసారి ఫలితాలు మాత్రం ఆసక్తికరంగా ఉండేట్టు కనిపి స్తోంది.

సిరిసిల్ల మున్సిపాలిటీ పై జెండాఎగరవేసేందుకు కాంగ్రెస్ బిఆర్‌ఎస్ పార్టీలు పోటీ పడుతుండగా ఈసారి మాత్రం స్వతంత్రంగా గెలుపొందిన అభ్యర్థులే కీలకం కానున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నా రు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో ఎక్కడ చూ సిన ప్రస్తుతానికి ఈ అంశం పైనే జోరుగా చర్చలు నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 

వేములవాడ మున్సిపాలిటీలో

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న రెండు మున్సిపాలిటీలలో రెండవది వేములవాడ మున్సిపాలిటీ 28 మంది కౌన్సిల్ సభ్యులు ఉండగా 58 మంది కౌన్సిలర్ అభ్యర్థులు పోటీ పడ్డారు.వేములవాడ మున్సిపాలిటీలు ప్రధానంగా త్రిముఖ పోటీ జరిగిందని చెప్పవచ్చు. గతంలో టిఆర్‌ఎస్ 16, బిజెపి 6, కాంగ్రెస్ 1 గెలుపొందగా ఈసారి భిన్నమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు.

వేములవాడ మున్సిప ల్ అధికారులు ధ్రువీకరించారు. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ కూడా మహిళలే అత్యధికంగా ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి. ఫలితాలపై ఎవరి అంచనాలు వా రికి ఉండగా వేములవాడ మున్సిపల్ పీఠంపై జెండా ఎవరు ఎగరేస్తారన్నది వేసి చూడవలసి ఉంది.మొత్తానికి సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలలో జరిగే రాజకీయ సమీకరణలు, వ్యూహ ప్రతి వ్యూహాలు ఎలాంటి మలుపు తీసుకుంటాయే అన్న చర్చ విస్తృతంగా రెండు మున్సిపాలిటీలలో నడుస్తుంది. 

గతంలో మునిసిపాలిటీల్లో వచ్చిన ఫలితాలకు భిన్నంగా ఈసారి ఫలితాలు ఉంటాయన్నది పరిశీలగుల అంచనా. పోలింగ్ ప్రశాంతంగా జరగడం కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతా నికి సిరిసిల్ల వేములవాడ మున్సిపాలిటీలలోని కౌన్సిలర్ అభ్యర్థుల భవితవ్యం బ్యాలె ట్ బాక్సుల్లో భద్రంగా ఉంది. విజయం ఎవర్ని వరిస్తుందన్నది తుది ఫలితాలు వెలువడే వరకు వేచి చూడాల్సిందే..