calender_icon.png 13 February, 2026 | 2:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణకు బంగారు భవిష్యత్తు విద్యే..

13-02-2026 12:00:00 AM

మెనూ తప్పక పాటించాలి 

మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

గోపాలపేట ఫిబ్రవరి12 : తెలంగాణకు బంగారు భవిష్యత్తును తీసుకొచ్చేది ఒక విద్యా వ్యవస్థ ఒ క్కటేనని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. గురువారం గోపాలపేట మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజన పథకాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. విద్యాభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో మా ర్పులను తీసుకువచ్చిందని, విద్యా వ్యవస్థను బలోపేతం చేసి తెలంగాణకు బంగారు భవిష్యత్తు ను అందించేందుకు ముందుకెళుతున్నట్టు ఆయన చెప్పారు.

మధ్యాహ్న పథక భోజనాన్ని తయా రు చేసే క్రమంలో పాఠశాల అధ్యాపకులు కూరగాయలు పప్పు తదితరు వాటిని పరిశీలించారన్నారు. విద్యార్థులకు ప్రతినిత్యం మెనూ ప్రకారం నాణ్యమైన వంటలను అందించాలని అధి కారులకు సూచించారు. పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉన్నాయని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.