calender_icon.png 21 August, 2025 | 9:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంత తొందరెందుకు కేటీఆర్?

21-08-2025 01:05:24 AM

  1. పూర్తిగా తెలుసుకొని మాట్లాడాలి

తప్పుగా పోస్టులు పెడితే నిజాలు అవుతాయా..?

కేటీఆర్ నిరూపించు లేకుంటే క్షమాపణ చెప్పు 

దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్‌రెడ్డి

మహబూబ్ నగర్ ఆగస్టు 20 (విజయ క్రాంతి) : ఏదో గాబరా గాబరావ్ పోస్టులు పెడుతూ ఎలాగైనా ప్రభుత్వాన్ని బదిలాం చే యాలనే సంకల్పంతో కేటీఆర్ ఉన్నారని అం త ఆతృత ఎందుకని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డాకుల మండల పరిధిలోని రాచాల చెక్ డ్యామ్ కొట్టకుపోయినట్టు ట్విట్టర్లో కేటీఆర్ పోస్టులు పెట్టారని ఇది నిరూపించాలని..

లే నియెడల నిరూపించాలి లేదా ముక్కు నేల కు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశా రు. ఈ సందర్భంగా జిఎంఆర్ మాట్లాడుతూరాచాల వద్ద చెక్ డ్యామ్ కొట్టుకుపోయి నట్లు కేటీఆర్ వాస్తవాలు తెలుసుకోకుండా, ప్రభుత్వంపై బురదజల్లే ఉద్దేశంతో తప్పుడు ప్రచారం చేస్తున్నాడని కేటీఆర్ పై మండిపడ్డారు. రాచాలవద్ద చెక్ డ్యాం తెగిపోలేదని, గతంలో వరద నీటిని మున్ గల్ చెడ్ చెరువు నింపడానికిగత ప్రభుత్వం గైడ్ వాల్ నిర్మించిందని, భారీ వరద ఉధృతికి ఆ గైడ్ వాల్ తెగి పంట పొలాల్లోకి నీరు వెళ్లిందని తెలియజేశారు.

గైడ్ వాల్ తెగి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం తరఫున ఆదు కుంటామని ఎమ్మెల్యే జియంఆర్ భరోసా ఇచ్చారు. చెక్ డ్యామ్ గురించి వాస్తవాలు పూర్తిగా తెలుసుకోకుండా తప్పుడు సమాచారాన్ని 15లోకి తీసుకొని హైదరాబాద్ లో కు ర్చీని ట్విట్టర్ లో పెట్టేవాడిని ఏమి అనాలని విమర్శించారు. మంగళవారం ఇరిగేషన్ శా ఖ ఈఈ రాచాల వద్ద చెక్ డ్యాం ను పరిశీలించి, వరద ఉధృతితో చెక్ డ్యామ్ కు ఎ లాంటి ముప్పు లేదని,

చెక్ డ్యాం చెక్కుచెదరకుండా ఉందని రిపోర్ట్ ఇచ్చారని, అధికా రులు ఇచ్చిన నివేదికను పక్కనపెట్టి, చెక్ డ్యామ్ కూలినట్టు ట్విట్టర్లో తప్పుడు ప్రచా రం చేస్తూ కేటీఆర్ శునకానందం పొందుతున్నారని విమర్శించారు. తప్పుడు సమాచా రం వ్యాప్తి చేయడమే కాక ముఖ్యమంత్రి ని ఉద్దేశించి పదే పదే పిచ్చి వాగుడు మానుకుని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని ఎలా పడితే అలా మాట్లాడితే ప్రజల్లో పూర్తిగా చులకన అవుతారని అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మూడ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, నేతలు సం జీవ్ ముదిరాజ్, గంజి ఆంజనేయులు, బెనహర్ తదితరులుఉన్నారు.